Anushka Shetty : స్వీటీ అనుష్కశెట్టికి సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా గుర్తింపు ఉంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ కూడా ఆమెనే అని చెప్పుకోవాలి. ఎలాంటి లేడీ పవర్ ఫుల్ రోల్స్ చేయాలన్నా సరే అది కేవలం అనుష్కశెట్టికి మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే ఆమెను అంతగా ఆరాధిస్తూ ఉంటారు.
ఆమె అనగానే అందరికీ దేవసేన, అరుంధతీ లాంటి పాత్రలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అలాంటి అనుష్కశెట్టి ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతోంది. కాగ ఆమె మొదట్లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, కమర్షియల్ సినిమాలు బాగా చేసేది. అప్పట్లో సీనియర్ హీరోలతో కూడా బాగానే సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
కాగా ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొన్ని కండీషన్లు పెట్టుకున్నాను. కానీ డైరెక్టర్లు, హీరోల ఫోర్స్ తో వాటిని క్రాస్ చేయాల్సి వచ్చింది. జగపతి బాబుతో గతంలో ఓ సినిమా చేశాను. అందులో లిప్ లాక్ సీన్ ఉంది. అది చేయనని నేను ముందే చెప్పాను.
Anushka Shetty Set Some Conditions In Her New Entry InTo Film Industry
కానీ సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత అదే సినిమాకు వెయిట్ తీసుకువస్తుందని చెప్పారు. అయినా నేను అంగీకరించలేదు. కానీ జగపతి బాబు, డైరెక్టర్ కలిసి చాలా బలవంతంగా ఒప్పించారు. వారి మాటలను కాదనలేక చేశాను. కానీ తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శెట్టి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Read Also : Sri Reddy : మెగా ఫ్యామిలీలో బన్నీ ఒక్కడే నిజమైన మగాడు.. అంతా చెత్తగాళ్లేః శ్రీరెడ్డి
Read Also : Akshay Kumar : ఒకప్పుడు హోటల్ వెయిటర్.. ఇప్పుడు ఇండియా సూపర్ స్టార్.. ఎవరో తెలుసా..?