Gold river : ఇండియాలో పారే నదిలో దొరుకుతున్న బంగారం.. ఎక్కడంటే?

Gold river : భారతీయులకు బంగారం అంటే అమితమైన ప్రేమ. పచ్చిగా చెప్పాలంటే పిచ్చి. పడి చచ్చిపోతారు. పండుగలు, శుభకార్యాలు, మంచి రోజు పేరు చెప్పుకుని ఎప్పుడూ బంగారం కొంటూనే ఉంటారు. అందుకే మనదేశంలో ఎన్ని బంగారం నిల్వలు ఉన్నా సరిపోవడంలేదు. దీంతో విదేశాల నుంచి కూడా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది భారత ప్రభుత్వం.. అయితే, మనదేశంలో పారే ఓ నదిలో బంగారం దొరకుతుందట.. ఇది జోక్ కానే కాదు.. ఎవరూ నమ్మలేని నిజం. జార్ఖండ్ రాష్ట్రంలోని […].

By: jyothi

Published Date - Tue - 30 November 21

Gold river :  ఇండియాలో పారే నదిలో దొరుకుతున్న బంగారం.. ఎక్కడంటే?

Gold river : భారతీయులకు బంగారం అంటే అమితమైన ప్రేమ. పచ్చిగా చెప్పాలంటే పిచ్చి. పడి చచ్చిపోతారు. పండుగలు, శుభకార్యాలు, మంచి రోజు పేరు చెప్పుకుని ఎప్పుడూ బంగారం కొంటూనే ఉంటారు. అందుకే మనదేశంలో ఎన్ని బంగారం నిల్వలు ఉన్నా సరిపోవడంలేదు. దీంతో విదేశాల నుంచి కూడా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది భారత ప్రభుత్వం.. అయితే, మనదేశంలో పారే ఓ నదిలో బంగారం దొరకుతుందట.. ఇది జోక్ కానే కాదు.. ఎవరూ నమ్మలేని నిజం. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణానికి సమీపంలో గల పిస్కా (Piska) అనే గ్రామంలో స్వర్ణముఖి నది పారుతుంది. అక్కడ ఈ విచిత్రం చోటుచేసుకుంటోంది. బంగారం ఎలా దొరుకుతుందో తెలీక సైంటిస్టులు కూడా తలలు పట్టకుంటున్నారట.. అయితే, అక్కడి ప్రజలు మాత్రం బంగారం కోసం రోజు వెతుకులాట ప్రారంభిస్తారని తెలిసింది. చిన్న చిన్న రేణువుల రూపంలో లభించే ఈ బంగారం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు. ఆ విశేషాలెంటో ఇపుడు తెలుసుకుందాం..

golden river

golden river


Gold river : నదిలోని ఇసుకలో బంగారు రేణువులు

బంగారం దొరుకుతుందని కాబట్టే ఈ నదికి ‘స్వర్ణముఖి’ అని పేరు వచ్చిందట.. ఇక్కడ కుప్పలుగా ఏమీ దొరకదు. రేణువుల రూపంలో మాత్రమే లభ్యమవుతుంది. దీనికోసం అక్కడి ప్రజలు ఉదయమే నదికి వస్తారట.. అందులోని ఇసుకున జల్లడ పట్టి బంగారం కోసం వెతుకుతారని సమాచారం. రేణువుల రూపంలో దొరికిన బంగారాన్ని స్థానికంగా ఉన్న వ్యాపారులు లేదా రాంచీకి తీసుకెళ్లి అమ్ముకుని జీవనం సాగిస్తారట..


golden river

golden river



ముఖ్యంగా బంగారం చలికాలంలో ఎక్కువగా లభిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.. ఈ నది దాదాపు 395 కిలో మీటర్లు మేర ప్రవహిస్తుంది. తల్సారీ అనే ప్రాంతం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. స్వర్ణముఖి నది పారుకుంటూ మూడు రాష్ట్రాలను టచ్ చేస్తున్నా వేరే ఎక్కడా బంగారం లభించదు. ఒక్క జార్ఖండ్ లో మాత్రమే దొరుకుతుందట.. అయితే, అక్కడి భూమిలో బంగారు గనులు ఉండొచ్చని అందరూ అనుమానిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. జార్ఖండ్‌ రాష్ట్రం ప్రధానంగా బొగ్గు, బంగారం గనుల నుంచే అధిక ఆదాయం పొందుతున్నది.


Golden river

Golden river

Tags

Latest News

Related News