Ashu Reddy : రోజురోజుకూ కల్చర్ బాగా ఛేంజ్ అయిపోతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఇలాంటి కల్చర్ ను ఎక్కువగా తీసుకువస్తున్నారు. పెండ్లికి ముందే డేటింగ్ చేసే కల్చర్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా తమకంటే చిన్నవారితో కూడా డేటింగ్ చేస్తున్నారు కొందరు భామలు.
అయితే ఈ కల్చర్ ను చాలామంది వ్యతిరేకిస్తున్నా సరే సెలబ్రిటీలు మాత్రం అస్సలు వెనక్కు తగ్గట్లేదు. తాజాగా అషురెడ్డి కూడా దీనిపై స్పందించింది. ఆమె ఇప్పుడు అవకాశాలు లేక ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది. అదే సమయంలో కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఎక్కువగా న్యూడిటీ, పర్సనల్ లైఫ్ గురించే స్పందిస్తోంది.
ఇప్పుడు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు రిలేషన్ మీద ఓ ప్రశ్న ఎదురైంది. దానిపై అషురెడ్డి ఘాటుగా రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ.. నేను కూడా గతంలో లివింగ్ రిలేషన్ లో ఉన్నాను. పెండ్లికి ముందే డేటింగ్ చేస్తే ఆ వ్యక్తితో మనం చాలా ఫ్రీడమ్ గా ఉంటాం.
ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కాబట్టి అందులో బాధపడేంత తప్పు అయితే లేదని నా అభిప్రాయం అంటూ తెలిపింది అషురెడ్డి. ఆమె చేసిన కామెంట్లపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తప్పు చేయమని చెబుతున్నావా అంటూ అడుగుతున్నారు.
Also Read : Actress Kanishka Soni : ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్ చూపించమన్నాడు.. డైరెక్టర్ పై హీరోయిన్ ఆరోపణలు..!
Also Read : Sri Reddy : ఆ హీరో లుంగీ కట్టుకుని నా రూమ్ కు వచ్చాడు.. శ్రీరెడ్డి మరో సంచలనం..!