Health Tips : చలికాలం ప్రారంభం కావడంతో పెద్దలు, పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. చలితో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడు తున్నాయి. ముఖ్యంగా ఈ చలి కాలంలో దగ్గు, జలుబు సమస్యలు వేధిస్తూనే ఉంటాయి.. అందుకే ఈ చలికాలంలో ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం.. చలికాలంలో మనిషి రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు త్వరగా సోకుతుంటాయి.
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోకపోతే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందట.. మరీ ముఖ్యంగా ఆస్తమా రోగులు కాలానుగుణంగా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వారు కంట్రోల్ లో ఉండకపోతే వారి జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో దీని దాడి ఎక్కువుగా ఉంటుంది.. అందుకే ఆస్తమా వ్యాధితో బాధపడేవారు తప్పకుండా శీతాకాలంలో నచ్చినా నచ్చకపోయినా చల్లటి వాటికి దూరంగా ఉండాలి.
అలాగే నీళ్ళల్లో ఎక్కువుగా ఉండకుండా సాధ్యమైనంత వరకు నీటికి దూరంగా ఉండాలి.. సాధారణంగా నీరు ఎక్కువుగా తాగే అలవాటు ఉంటే చలికాలంలో తగ్గించుకుని గోరు వెచ్చటి నీటిని తాగడం ఉత్తమం. అలాగే వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి.. చెవి, ముక్కు, నోటిని స్కార్ఫ్ తో కవర్ చేసుకోవాలి.. ఇంకా ఇంటి దగ్గరే వ్యాయామం చేయడం ఉత్తమం..
అలాగే చలికాలంలో నోటి ద్వారా ఊపిరి తీసుకుంటే బయట ఉన్న గాలి నేరుగా ఊపిరితిత్తుల లోకి వెళ్తుంది.. ఆస్తమా ఉన్నవారికి ఇది ప్రమాదం.. అందుకే కేవలం ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవడం మంచిది.. అలాగే ఆస్తమా ఉన్నవారు పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండాలి.. ఎందుకంటే వింటర్ లో వాటికీ రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. ఇక ఈ జాగ్రత్తలతో పాటు వైద్యుల సలహాలు, డైట్ కూడా పాటిస్తేనే ఆస్తమా వారు వింటర్ నుండి బయట పడవచ్చు..
Read Also : Sankranti : మకర సంక్రాంతి రోజు ఈ పని చేస్తే చాలు.. కష్టాల నుండి విముక్తి పొందవచ్చు..
Read Also : Suma Adda : మెగాస్టార్ తన మొబైల్ లో పవన్, సురేఖ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా?