Astrologer Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కువగా సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజం అయ్యాయి. నాగచైతన్య-సమంత విడిపోతారని ముందే చెప్పాడు వేణుస్వామి. ఆయన చెప్పినట్టే వారిద్దరూ విడిపోయారు.
ఇక మొన్నటికి మొన్న 40 ఏండ్ల టాలీవుడ్ హీరో అనారోగ్య సమస్యలతో చనిపోతారని చెప్పాడు. ఆయన పేరు చెప్పకపోయినా.. అదే పోలికలకు దగ్గరగా ఉన్న నందమూరి తారకరత్న చనిపోయాడు. అప్పటి నుంచే వేణుస్వామి చెప్పే వాటిని అందరూ సీరియస్ గా తీసుకుంటున్నారు.
ఇక తాజాగా వేణుస్వామి మరో సంచలన కామెంట్లు చేశాడు. టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు 2026లో చనిపోతారని బల్ల గుద్దినట్లు చెప్పారు. అందులో ఒకరు అనారోగ్య సమస్యలతో చనిపోతే.. మరొకరు అవకాశాలు లేక ఆర్థిక సమస్యలతో సూసైడ్ చేసుకుంటారని తెలిపాడు వేణుస్వామి.
ఆయన చేసిన కామెంట్లతో ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకీ ఆ చనిపోయే హీరోలు ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. వీరిద్దరితో పాటు మరో స్టార్ హీరోయిన్ కూడా చనిపోతుందని చెప్పాడు కానీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు. మరి వేణుస్వామి చెప్పినవి జరుగుతాయా లేదా అనేది చూడాలి.
Read Also : Niharika Konidela : ఆ హీరో వీపుపై ఎక్కాలని ఉంది.. నిహారిక ఏంటీ మాటలు.. అందుకే విడాకులు అంటూ…!
Read Also : Madhavi Latha : ప్రభాస్ కు తెలివి లేదా.. హీరోయిన్ మాధవీలత సంచలన కామెంట్లు..!