Astrologer Venu Swamy : ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యల పెండ్లి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ రూమర్లే అంటూ చాలా సార్లు లావణ్య ఇన్ డైరెక్టుగా తెలిపింది. కానీ వీరిద్దరి ప్రేమ నిజమే అంటూ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ఎందుకంటే వీరిద్దరూ త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారు. జూన్ 9న వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. కాగా వీరిద్దరి ప్రేమ విషయాన్ని గతంలోనే వేణుస్వామి ఇన్ డైరెక్టుగా తెలిపాడు. వేణుస్వామి టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పిన విషయాలు చాలా సార్లు నిజం అయ్యాయి.
కాగా తారకరత్న చనిపోతారని ఆయన ముందే చెప్పారు. చెప్పినట్టే జరిగింది. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఓ టాలీవుడ్ హీరో, హీరోయిన్ పెండ్లి చేసుకుంటారు. కానీ వారి జీవితం ఆశించినంత సక్సెస్ ఫుల్ గా అయితే ఉండదు. ఇరువురి ఫ్యామిలీలో విషాదం తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కానీ ఆ హీరో, హీరోయిన్ పేర్లు మాత్రం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పింది మాత్రం వరుణ్, లావణ్య గురించే అని అర్థం అవుతోంది. అంటే వరుణ్, లావణ్య కుటుంబాల్లో విషాదం తప్పదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ వేణుస్వామిని తిట్టిపోస్తున్నారు.
Read Also : Niharika konidela : నన్ను చూసి ఎవరూ ఆ పని చేసుకోరు.. నిహారిక ఏంటీ మాటలు..!
Read Also : Madhavi Latha : వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు నాగ్ మామ.. హీరోయిన్ షాకింగ్ కామెంట్లు..!