Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్టోబర్ రెండవ తేది నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం వరించనుందట.. ఎందుకంటే బుధగ్రహం సంచారం ఈ రాశుల వారికి మంచి చేకూరుస్తుందట.. సాధారణంగా గ్రహాల మూమెంట్‌ను బట్టి జాతకచక్రంలోని రాశుల వారిపై ప్రభావం పడుతుంది.భవిష్యత్ లో ఓ రాశివారికి రోజులు అనుకూలంగా మారనున్నాయా? ఏదైనా ఇబ్బందులు తలెత్తనున్నాయా? అనేది జ్యోతిష్యశాస్తం నివృత్తి చేయనుంది.
ఈ నెల 10వ తేదిన బుధుడు కన్యారాశిలో తిరోగమనం చెందాడు.మరల అక్టోబర్ 2వ తేదిన ప్రవేశించబోతున్నాడు. కన్యారాశిలోకి బుధుడి సంచారం వలన 12 రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే, ఈ మూడు జాతక చక్రాల వారికి శుభం కలుగనుందట..అందులో ఏయే రాశుల వారు ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ముందుగా సింహరాశి విషయానికొస్తే కన్యారాశిలో బుధుడి సంచారం వలన వీరికి మంచి రోజులు మొదలవుతాయి. బుధగ్రహం మీ రాశిచక్రం నుండి రెండో ఇంటికి మూవ్ అవుతుంది.ఇది డబ్బు యొక్క స్థానంగా పరిగణించబడుతుంది.ఈr టైంలో ఆకస్మిక లాభాలను పొందే అవకాశం ఉంది. రానిబాకీలు తిరిగి రావొచ్చు.వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఇక వృశ్చిక రాశి విషయానికొస్తే బుధగ్రహం గమనంతో మీరు వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన విజయాలను పొందవచ్చు.ఇది ఆదాయ మార్గానికి దారిచూపుతుంది. వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మంచి జీవితాన్ని పొందుతారు. కుటుంబంలో అంతా మంచి జరుగుతుంది.నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి.
ఇక ధనుస్సు రాశికి బుధగ్రహం పదవ ఇంట్లో కదులుతున్నందున ఇది పని, వ్యాపారం, ఉద్యోగానికి చెందిన భావంగా పరిగణించబడుతుంది. ఈ టైంలో వీరికి కొత్తగా ఉద్యోగం, ప్రమోషన్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది.
Read Also : Astrology : ఈ పేరున్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు.. లక్ష్మీ కాటాక్షం దండిగా ఉంటుందట..
Read Also : Astrology : అమ్మాయిలను పడేయడంలో ఈ రాశుల వారికి తిరుగులేదంట..