ATM : ఏటీఎం కార్డులను మర్చిపోండిక

ATM : ఇన్నాళ్లూ ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేయాలంటే కంపల్సరీగా డెబిట్ కార్డు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరంలేదు. ఎందుకంటే ఏటీఎంలో కనిపించే క్యూఆర్ కోడ్ ని ఫోన్ ద్వారా స్కాన్ చేసి డబ్బు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ఫోన్ లో ఫోన్ పే/పేటీఎం/గూగుల్ పే/అమేజాన్ పే తదితర యాప్ లలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఆ యాప్ లో మీ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకొని […].

By: jyothi

Updated On - Mon - 12 April 21

ATM : ఏటీఎం కార్డులను మర్చిపోండిక

ATM : ఇన్నాళ్లూ ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేయాలంటే కంపల్సరీగా డెబిట్ కార్డు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరంలేదు. ఎందుకంటే ఏటీఎంలో కనిపించే క్యూఆర్ కోడ్ ని ఫోన్ ద్వారా స్కాన్ చేసి డబ్బు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే ఫోన్ లో ఫోన్ పే/పేటీఎం/గూగుల్ పే/అమేజాన్ పే తదితర యాప్ లలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఆ యాప్ లో మీ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకొని ఉండాలి. షాపులో ఎలాగైతే ఈ యాప్ లతో పేమెంట్లు చేస్తామో అలాగే ఏటీఎంల నుంచి కూడా నగదును ఈజీగా తీసుకోవచ్చు.

సిటీ యూనియన్ బ్యాంక్..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సిటీ యూనియన్ బ్యాంక్(సీయూబీ)తో కలిసి ఈ కొత్త ఏటీఎంలను రూపొందించింది. వీటిని ‘‘ఇంటర్ ఆపరబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ మెషీన్లు’’ అంటారు. ఏటీఎంల తయారీ సంస్థ ఎన్సీఆర్ కార్పొరేషన్ ఈ నూతన సాంకేతికతకు రూపకల్పన చేసింది. సిటీ యూనియన్ బ్యాంక్ కి చెందిన 1,500లకు పైగా ఏటీఎంలలో ఈ సరికొత్త సాఫ్ట్ వేర్ ని ఇన్ స్టాల్ చేశారు. మరిన్ని ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ సర్వీసును త్వరలో అందుబాటులోకి తేనున్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఎన్సీఆర్ కార్పొరేషన్(ఇండియా) ఎండీ రోజ్ దస్తూర్ పేర్కొన్నారు.

ATM : foget atm cards.. do app based cash withdrawal

ATM : foget atm cards.. do app based cash withdrawal

ఇలా చేయాలి:

ఏటీఎంలో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ లోని పైన పేర్కొన్న యాప్ తో ఆ కోడ్ ని స్కాన్ చేయాలి. తర్వాత ఎంత అమౌంట్ కావాలో ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ నొక్కాలి. అనంతరం నాలుగు లేదా ఆరు అంకెల యూపీఐ పిన్ ని ఎంటర్ చేయాలి. దీంతో క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఒక లావాదేవీలో రూ.5,000 మాత్రమే తీసుకునే వీలుంది. భవిష్యత్తులో ఈ లిమిట్ ని పెంచుతారని అంటున్నారు. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో లైట్ యాప్ ద్వారా తన కస్టమర్లకు ఈ సర్వీసును అందిస్తోంది.

Read Today's Latest News News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News