Delivery in plane : ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఎప్పటికైనా ఆ సమాచారం మనకు ఉపయోగడపడవచ్చు. మన దేశంలో ఉంటున్నాము కదా..! ఇక్కడి ఇన్‌ఫర్‌మేషన్ చాలనుకుంటే మీరు జీవితంలో వెనకబడిపోతారన్న మాట వాస్తవం.. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.చాలా సింపుల్. గూగుల్ ను అడిగినా తెలిసిపోతుంది. కొన్ని ఆసక్తికర అంశాలు, విపత్కర పరిస్థితులు, చాలా భద్రత కలిగిన దేశాలు, అభివృద్ధి, పేదరికం గురించి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. అపుడు విదేశాలకు వలసపోయే రోజులు కూడా రావొచ్చు. అలాంటప్పుడు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
delivery at plane
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్,మధ్య ప్రాచ్యంలో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ గర్భిణీ మహిళ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రసవం జరిగితే ఆ బిడ్డకు ఏ దేశ పౌరసత్వం వస్తుంది. ఏ దేశ పౌరుడు అవుతాడు ఆ బిడ్డ.. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఓ బిడ్డ ఇండియా లేదా అమెరికాలో పుడితే వారికి ఆయా దేశాలు పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, గగనతలంలో బిడ్డ పుడితే అతనికి ఏ దేశం పౌరసత్వం ఇస్తుందనేది చాలా మంది అనుమానం రావొచ్చు.
baby delivery at plane
భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న ఓ విమానంలో ప్రసవం జరిగితే ఆ బిడ్డ ఆ టైంలో ఖచ్చితంగా ఏ దేశ గగనతలంలో ఉంటే ఆ దేశ పౌరసత్వం కోసం తల్లిదండ్రులు అప్లై చేసుకోవచ్చు. ఆ దేశం పౌరసత్వం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రపంచ దేశాలు దీనికి సంబంధించి తమ విదేశీ పాలసీలను మార్చుకున్నట్టు తెలిసింది. సపోస్ బిడ్డ అమెరికా గగనతలంలో ఉంటే ఆ దేశం.. ఇండియాలో గగనతలంలో ఉంటే మన దేశం ఆ బిడ్డకు సిటిజన్ షిప్ ఇవ్వాల్సిందే. ఇంకొక ముఖ్యమైన విషయం ఎంటంటే తల్లిదండ్రులు ఏ దేశానికి చెందిన వారనే దానితో నిమిత్తం లేకుండా బిడ్డకు ఆయా దేశాలు పౌరసత్వం ఇవ్వాలి. ఇకపోతే కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అంగీకరిస్తాయి. ఇండియా మాత్రం అందుకు అంగీకరించదు. ఉండే ఇండియా లేదా విదేశీ పౌరసత్వం మాత్రమే ఉండాలి. అమెరికా, గల్ఫ్ కంట్రీస్, యూరప్ కంట్రీస్‌లో రెండు పౌరసత్వాలు యాక్సెప్ట్ చేసినా.. ఒకవేళ ఇండియాలో బిడ్డ పుడితే ఇక్కడి పౌరతస్వం మాత్రమే వస్తుంది. బిడ్డ పెరిగి పెద్దయ్యాక విదేశీ పౌరతస్వం కోరుకుంటే.. అతను తిరిగి ఇండియా పౌరుడు కానట్టే..
delivery at plane