Bellamkonda Ganesh : నందమూరి బాలకృష్ణపై ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ ఒకటి ఉంది. అదేంటంటే ఆయన ఇంట్లో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగాయి. 2004లో నందమూరి బాలకృష్ణ– నిర్మాత బెల్లకొండ సురేష్ కాంబోలో లక్ష్మీ నరసింహ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ తర్వాత జూన్ 4వ తేదీన బాలయ్య ఇంట్లో సురేష్ బాబు భేటీ అయ్యారు.
ఈ భేటీలోనే సురేష్ బాబు, ఆయన జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిలపై కాల్పులు జరిగాయి. దాంతో బాలకృష్ణపై కేసు నమోదు చేశారు పోలీసులు. మొదట సురేష్ బాబు కూడా బాలయ్యనే తన మీద కాల్పులు జరిపారంటూ ఆరోపించారు. తర్వాత మూడో వ్యక్తి చేశారంటూ మాట మార్చారు. దాంతో ఇది మిస్టరీగా మారిపోయింది.
అయితే ఇన్నేండ్ల తర్వాత సురేష్ బాబు చిన్న కొడుకు గణేశ్ తాజాగా ఆ విషయం మీద స్పందించారు. సురేష్ బాబుకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్. రెండో కొడుకు గణేశ్ రీసెంట్ గానే ఓ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన రెండో మూవీ నేను స్టూడెంట్ సర్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆయన కాల్పుల ఘటనపై స్పందించాడు. ఆ ఘటన జరిగినప్పుడు నాకు పదేండ్లు కూడా లేవు. ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ఇన్‌సిడెంట్ గురించి నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ మా నాన్నతో మాట్లాడలేదు. మా నాన్న కూడా దాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టే ఉండేవారు.. నేను కూడా అలాగే ఉన్నాను అంటూ తెలిపారు గణేశ్. అంటే ఆయన మాటలతో కూడా క్లారిటీ రాలేదన్నమాట.
Read Also : Pawan Kalyan : మహేశ్ కోసం రూ.200 కోట్లు వదులుకున్న పవన్.. ఎంత త్యాగమయ్యా..?
Read Also : Heroine : అతనితో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న హీరోయిన్.. ఇన్నాళ్లకు బయట పడింది..!