Bhoomika Comments on casting couch :ఈ నడుమ సీనియర్ హీరోయిన్లు కూడా కాస్టింగ్ కౌచ్ మీద నోరు విప్పుతున్నారు. వారు గతంలో ఇలాంటి వాటి మీద పెద్దగా స్పందించేవారు కాదు. కానీ మీటూ ఉద్యమం తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ భూమిక కూడా ఇదే విషయం మీద స్పందించింది.
అప్పట్లో భూమిక పేరుచెబితే కుర్రాళ్లు ఊగిపోయేవారు. తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టి పడేసింది ఈ బ్యూటీ. స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలు చేస్తూ వస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఆమె కూడా కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.
ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్న వచ్చింది. దానిపై ఆమె మాట్లాడుతూ.. చాలామంది దీని గురించి నెగెటివ్ కామెంట్లు చేస్తుండగా విన్నాను. కానీ నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ఎదురు కాలేదు. ఏదైనా ఛాన్స్ వస్తే నా మేనేజర్ ను పంపించేదాన్ని.
అంతే గానీ నేను డైరెక్ట్ గా వెళ్లేదాన్ని కాదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని నేను అనను. కొందరు నెగెటివ్ గా ఆలోచించే వారు ఉంటారు. వారి కోరికలు తీరిస్తేనే ఛాన్స్ ఇవ్వాలని అనుకునేవారు చాలా తక్కువ. అలాంటి వారు నాకు కనిపించలేదు. కానీ ఇండస్ట్రీలో వారు ఉన్నారని నాకు తెలుసు అంటూ చెప్పింది భూమిక.