Latest Smartphones : ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించింది. ఇది ఈనెల 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ICICI బ్యాంక్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ కార్డ్‌లు, సిటీ బ్యాంక్ కార్డ్ వినియోగించి కొనుగోలుచేస్తే మీకు 12% వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఎక్సేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI మరియు స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను వంటి అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇది కాకుండా, ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు పే లేటర్ ఆప్షన్‌ను కూడా అందుబాటులో ఉంది. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో
ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఉత్తమ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసకుందాం.
Apple iPhone 13 బేస్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 62,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్సెట్తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ను కలిగి ఆకర్షణీయంగా ఉంటంది. 12MP డ్యూయల్ కెమెరా సెటప్ దీని ప్రత్యేకత. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.17,500 వరకు తగ్గింపు లభిస్తంది. అలాగే నథింగ్ ఫోన్ (1) యొక్క 8GB+128GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,499కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778G+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 6.55-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పని చేస్తోంది. హ్యాండ్‌సెట్‌లో సెల్ఫీ కోసం.. ముందు భాగంలో 16MP కెమెరా దీని ప్రత్యేకత.
ఇతర ఆఫర్లు
Google Pixel 7 రూ. 59,999 ధరకు లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో దీనిని మీరు రూ.51,499కి కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు 50MP ప్రధాన కెమెరా మరియు 12MP సెకండరీ కెమెరాతో ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. Samsung Galaxy S22 Plus రూ. 55,499 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm 8 Gen 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో మంచి పనితీరు కనబరుస్తుంది. ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇది 12MP మరియు 10MP సెన్సార్లతో 50MP ప్రైమరీ కెమెరాను మీకు మంచి ఫొటోషూట్ అనుభూతి కలిగిస్తుంది.
Read Also : Power Star Pawan Kalyan : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అనుకరించిన జనసేన అధినేత
Read Also : Roja Selvamani : ఆ హీరో వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను