Bigg Boss -5 : బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్ సీజన్ -5 అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇవాళ్టితో బిగ్ బాస్ 83వ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భాగంలో ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా నడుస్తోంది. వచ్చిన అథితులు అందరూ సభ్యులకు చెప్పే మాట మాత్రం కామన్.. నీ ఆట నువ్వే ఆడుకో.. గేమ్ పై దృష్టి పెట్టు.. ఇక ఈరోజు హైలెట్స్ ఎంటో చూసేద్దాం..
శుక్రవారం బిగ్‌బాస్ హోస్‌లోకి ప్రియాంక సిస్టర్ మధు, రవి భార్య, కూతురు, సన్నీ మదర్, షణ్ముక్ తల్లి అడుగుపెట్టారు. ఒక్కొక్కరు వాటి కుటుంబ సభ్యులకు తమకు తోచిన విధంగా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక సన్నీ మదర్ కళావతి కాస్త చురుగ్గా కనిపించారు. అందరితో ప్రేమగా మాట్లాడిన సన్నీ మదర్ ఆట మాత్రం సింగిల్‌గా ఆడుకో అంటుంది. కానీ టైటిల్ మాత్రం నువ్వే నెగ్గాలి అని చెబుతుంది. తనను నాగార్జునతో మాట్లాడించమని సన్నీని కోరగా ఓకే అంటాడు.
పింకీకి చెల్లి.. రవికి భార్య నిత్య స్వీట్ వార్నింగ్..
ప్రియాంక ఆటతీరుపై చెల్లి మధు సీరియస్ అవుతుంది. ఏం ఆడుతున్నావ్..నీ ధ్యాస గేమ్ మీద పెట్టు. డాడీకి మాటిచ్చావ్ గుర్తుందా? అది నిలబెట్టుకోవాలని ఆయన చెప్పామన్నారని సూటిగా చెప్పేస్తుంది.. ఇకపోతే రవి భార్య నిత్య కూడా నువ్వు అబద్ధాలు చెప్పడం మానేయ్. నీలో గెలిచే సత్తా ఉంది. నీకు పెట్టిన పేర్ల గురించి మేము పట్టించుకోవడం లేదని నిత్య రవికి ధైర్యం చెబుతుంది. ఇక రవి కూతురు వియా సభ్యులందరితో సరదాగా ఆడుకుంటుంది. ఎవరు గెలుస్తారని సభ్యులు వియాను అడుగగా డాడీ అని సమాధానం ఇస్తుంది.
షన్నూకు క్లాస్ పీకిన తల్లి.. అందరితో ఉండాలని..
రవి ఫ్యామిలీతో సభ్యులంతా బిజీగా ఉన్న టైంలో షన్నూ తల్లి బాబు అంటూ వస్తుంది. అమ్మను చూసిన కంగారులో షన్నూ అలాగే నిలబడిపోతాడు. తల్లిని కౌగించుకుని ఎమోషనల్ అవుతాడు. ఉమారాణి కొడుకు షన్నూకు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తుంది. గేమ్ బాగా ఆడు.. ఒక్కరితోనే కాకుండా అందరితో కలిసి ఉండాలని చెబుతుంది. షన్నూ దీప్తి టాపిక్ తీయగా.. నేను నిన్ను అర్థం చేసుకుంటాను. దీప్తి కూడా అంతే.. అపార్థం చేసుకోదని ధైర్యం చెబుతుంది. సిరి మదర్ అన్న మాటల గురించి షన్నూ చెప్పడానికి ట్రై చేస్తుంటే.. ఇంతలో సిరమ్మ వస్తుంది. ఇంకెంటి ఆంటీ సంగతులు అంటే.. ముందు గేమ్ మీద ఫోకస్ పెట్టాలని, అలగడం మానేయాలని స్వీట్ వార్నింగ్ ఇస్తుంది ఇద్దరికీ.. ఫ్యామిలీ మెంబర్ చెప్పిన మాటలను మరి సభ్యులు వింటారో లేదో చూద్దాం..