Bigg Boss Sarayu : బిగ్ బాస్ తో చాలామంది వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో బిగ్ బాస్ సరయు కూడా ఒకరు. ఆమె అంతకు ముందు యూట్యూబ్ లో బూతులు మాట్లాడే వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయింది. ఆ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అలా వచ్చిన ఛాన్స్ ను ఆమె బాగానే యూజ్ చేసుకుందని చెప్పుకోవాలి.
అయితే బిగ్ బాస్ లో కూడా ఆమె బోల్డ్ మాటలతో రచ్చ చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పటికీ సరయు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. చాలామంది నను వర్జినా అని అడుగుతున్నారు.
అసలు నేను వర్జిన్ కాదు. ఎందుకంటే గతంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. అతనితో ఏడేళ్లు సహజీవనం చేశాను. ఆ సమయంలో అతనితో ఎన్నోసార్లు శారీరకంగా కలిశాను. అప్పుడే నా వర్జిన్ ను కోల్పోయాను. మేమిద్దరం ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ పీటల వరకు వచ్చాక ఆగిపోయింది.
అతను ముందు రూ.25 లక్షలు కట్నం అడిగారు. దానికి ఒప్పుకున్న తర్వాత రూ.50లక్షలు.. ఆ తర్వాత కోటి ఇలా సగం ఆస్తి రాసివ్వమని డిమాండ్ చేశాడు. దాంతో అతని మీద నాకు నమ్మకంపోయింది. అందుకే నేనే పెళ్లికి నో చెప్పాను. ఇక లైఫ్ లో పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు అంటూ వివరించింది ఈ భామ.
Read Also : Jabardasth Hari : ఎర్ర చందనం స్మగ్లర్ గా మారిన జబర్దస్త్ కమెడియన్.. పరారీలో ఉన్న నటుడు..!
Read Also : Radhika Apte : ఆఫర్లు కావాలంటే అవి పెంచుకోమన్నారు.. రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్లు..!