Bindhu Madhavi Gives Clarity Relationship Trisha Boyfriend : బిందు మాధవిని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆమె సినిమాల కన్నా.. బిగ్ బాస్ తోనే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. గతంలో ఆమె తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఎందుకో స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఆ క్రమంలోనే ఆమె తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది.
అటు తమిళ బిగ్ బాస్ లో అలరించిన ఈ బ్యూటీ.. ఇటు తెలుగు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ గా నిలిచింది. దాంతో ఆమె పేరు మార్మోగిపోయింది. ఈ తెలుగు అమ్మాయికి బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఆమె ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ లు, ఓటీటీ సినిమాలతో బిజీగా మారిపోయింది.
ఈ క్రమంలోనే తాజాగా బిందు మాధవి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ ప్రమషన్స్ లో ఆమెకు షాకింగ్ ప్రశ్న ఎదరైంది. మీరు త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నారా అని అడిగారు. దానికి ఆమె నిర్మొహమాటంగా సమాధానం చెప్పింది. దానికి కొంత అవును.. కొంత కాదు అని చెప్పుకోవాలి.
త్రిష బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ నిజమే. కానీ మేమిద్దరం ఒకే సారిప్రేమించలేదు. త్రిషతో బ్రేకప్ అయిన తర్వాత నేను అతనితో డేట్ చేశాను అంటూ కుండ బద్దలు కొట్టేసింది ఈ భామ. ఇప్పుడు అతనితో విడిపోయింది ఈ హాట్ బ్యూటీ. కానీ అందరి ముందే తన డేటింగ్ విషయాన్ని ఓపెన్ గా చెప్పేయడం అంటే మాటలు కాదు.
Read Also : Kangana Ranaut Takes Drugs : నేను కూడా డ్రగ్స్ తీసుకున్నా.. కంగనా రనౌత్ సంచలన మ్యాటర్ లీక్..!