Deepika Padukone : దీపికా పదుకొనె రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా ఉంది. దాదాపు ఇరవై ఏండ్లుగా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఇంత కూడా తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.
అయితే ఎంత బిజీగా ఉన్నా సరే ఆమె తరచూ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటుంది. కానీ ఆమె చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు వివాదాన్ని రాజేస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ ఆమె మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఆమె మరోసారి ఇలాంటి కామెంట్లే చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో దీపికా పదుకొనె మాట్లాడుతూ.. నేను 18 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు నాకు ఓ చెత్త సలహా ఇచ్చారు. నీ ఎద భాగాలను పెంచుకో అప్పుడే నీకు మంచి లుక్ వస్తుంది అంటూ చెప్పారు. దాంతో నాకు చాలా చిరాకేసింది. ఆ వయసులో నాకు అలాంటి సలహాలు ఇస్తారని నేను అనుకోలేదు.
కానీ నేను అలాంటి కామెంట్లను సీరియస్ గా తీసుకోవడం ఎప్పుడో మానేశాను. నేను బాలీవుడ్ లోకి వచ్చిన మొదట్లో కూడా చాలా చెత్త కామెంట్లు ఫేస్ చేశాను. కానీ నేను ఏంటనేది నాకు విశ్వాసం ఉంది. అదే నన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టింది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది ఈ భామ.
Read Also : Astrologer Venu Swamy : వరుణ్-లావణ్య పెండ్లిని ముందే చెప్పేసిన వేణుస్వామి.. మరో విషాదం తప్పదా…?
Read Also : Director Sukumar : సాయిపల్లవిని నిండా ముంచేసిన సుకుమార్.. ఎంత పని చేశావయ్యా..?