Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ వన్ కుర్చీ పోరులో ఉన్నారు. అలాంటి మహేశ్ బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. అందుకే మహేశ్ బాబు కూడా ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తారు.
అయితే ఓ డైరెక్టర్ ను నమ్మి మహేశ్ బాబు చాలా మోసపోయాడంట. ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ అడ్డాలా. ఈయన వల్ల మహేశ్ బాబు సినీ కెరీర్ లో సంపాదించుకున్న ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఆ సినిమానే బ్రహ్మోత్సవం. మహేశ్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన ప్లాప్ సినిమాగా రికార్డు కొట్టింది.
అయితే ఈ సినిమా చేయడానికి ముందు మహేశ్ కు శ్రీకాంత్ ఓ కథ చెప్పారంట. ఆ కథ ఆయనకు బాగా నచ్చి సినిమా చేద్దాం అని మాట ఇచ్చారంట. కానీ సెట్స్ మీదకు వెళ్లే సమయానికి శ్రీకాంత్ మరో కథను మహేశ్ ముందుకు తెచ్చాడు. పాత కథ కంటే ఈ కథ చాలా బెటర్ గా ఉంటుంది అని మహేశ్ కు చెప్పాడు.
Brahmotsavam Movie Worst Flop Movie In Mahesh Babu Career
శ్రీకాంత్ మీద ఉన్న నమ్మకంతో మహేశ్ బాబు కూడా లైట్ గా కథ విని ఓకే చెప్పేశాడు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేశ్ విమర్శల పాలు అయ్యాడు. ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కున్నాడు. ఇంత ఘోరమైన సినిమాను ఎలా చేశావ్ అంటూ మహేశ్ ను ఇతర హీరోలు కూడా అన్నారంట. శ్రీకాంత్ అడ్డాల చేసిన పనికి మహేశ్ బాబు రిస్క్ లో పడ్డాడు.
Also Read : Kotasrinivas Rao : చిరంజీవి సోది చెప్పకు.. ఏదైనా చేసి చూపించు.. కోట శ్రీనివాస్ సంచలనం..!
Also Read : Actress Shirisha : అవకాశాల కోసం చాలామందితో పడుకున్నా.. నటి షాకింగ్ కామెంట్లు..!