Jabardasth Show : బుల్లితెరపై జబర్దస్త్ అనేది ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. కామెడీకి సరికొత్త అర్థాన్ని ఇచ్చింది. అప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూసిన కామెడీని బుల్లితెరపై కూడా పంచింది. ఇంకా చెప్పాలంటే వెండితెరపై కంటే జబర్దస్త్ లో వచ్చే కామెడీ చాలా బాగుంది అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు.
అయితే జబర్తస్త్ మొదలైనప్పుడు అసలు నడుస్తుందా లేదా అనుమానాలు చాలా మందికి ఉండేవి. అలాంటి సమయంలో జబర్దస్త్ ను నిలబెట్టింది మాత్రం ఒకే ఒక్క కమెడియన్. సుధీర్, హైపర్ ఆదిలు మాత్రం కాదండోయ్… ఎందుకంటే వీరంతా ఆయన తర్వాత వచ్చినవారే.
ఆ కమెడియన్ ఎవరో కాదు చమ్మక్ చంద్ర. అవును ఆయన కామెడీ స్కిట్లు అప్పట్లో జబర్దస్త్ కు బాగా వ్యూయర్ షిప్ ను తీసుకు వచ్చాయి. ఆయన కారణంగానే జబర్దస్త్ కు రేటింగ్ పెరిగింది. ఆయన పండించే కామెడీనే జబర్దస్త్ ను నిలబెట్టింది. ఆయన తర్వాత చాలామంది కమెడియన్లు జబర్దస్త్ కు మరింత రేటింగ్స్ పెంచారు.
Chammak Chandra Comedy Skits Increased Rating For Jabardasth Show
అలాంటి చమ్మక్ చంద్ర తర్వాత కాలంలో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు స్టార్ మాలో, ఆ తర్వాత జీ న్యూస్ లో చేశాడు. కానీ ఇప్పుడు బుల్లితెరప కనిపించకుండా పోయాడు. అటు సినిమాల్లో కూడా పెద్దగా కనిపించట్లేదు. ఆయన మళ్లీ జబర్దస్త్ కు ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also : Chammak Chandra : ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా చేశా.. చమ్మక్ చంద్ర కష్టాలు..!
Read Also : Pawan Kalyan : చిరును అవమానించిన స్టార్ హీరోయిన్.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!