Chammak Chandra : ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా చేశా.. చమ్మక్ చంద్ర కష్టాలు..!

Chammak Chandra : కష్టాలను ఓర్చుకుని ఎదిగిన వారే స్టార్లుగా రాణిస్తుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. ఈయన జబర్దస్త్ తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించాడు..

By: jyothi

Updated On - Tue - 6 June 23

Chammak Chandra : ఆ హీరో ఇంట్లో పనిమనిషిగా చేశా.. చమ్మక్ చంద్ర కష్టాలు..!

Chammak Chandra : సినిమా రంగం అనేది ఓ కలల ప్రపంచం. ఇక్కడ స్టార్లుగా ఎదిగిన చాలామంది ఒకప్పుడు తీరని కష్టాలను అనుభవించిన వారే ఉంటారు. కష్టాలను ఓర్చుకుని ఎదిగిన వారే స్టార్లుగా రాణిస్తుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. ఈయన జబర్దస్త్ తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించాడు.

ఇప్పుడు బుల్లితెరపై అటు వెండితెరపై కూడా వరుసగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనది కడు పేద కుటుంబం. తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి.

ఈ విషయాలను ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. కానీ నా దగ్గర డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలోడబ్బులు సరిపోక విజయ్ అనే నటుడి ఇంట్లో పనిమనిషిగా చేశాను. గిన్నెలు కడిగే వాడిని.

ఆ తర్వాత నాకు జబర్దస్త్ లో ఛాన్స్ రావడంతో నా లైఫ్‌ మారిపోయింది. అక్కడి నుంచి నేను డబ్బులకు ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు నాకు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు చమ్మక్ చంద్ర. ఆయన చేసిన కామెంట్లు ఆయన అభిమాలనులకు ఎమోషనల్ గా అనిపిస్తున్నాయి.

 

Read Also : Vishwak Sen : ఎవడు పడితే వాడు రౌడీ అంటున్నాడు.. విజయ్ కు కౌంటర్ వేసిన విశ్వక్..!

Read Also : Anupama Parameswaran : అతనితో అనుపమ ఘాటు లిప్ లాక్ లు.. తెగించేసిన బ్యూటీ..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News