Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయన మెగాస్టార్ గా ఎదిగారంటూ మామూలు విషయం కాదు. ఒక్కడిగా వచ్చి మెగా ప్రపంచాన్ని సృష్టించారు. ఆయన పేరు చెప్పుకుని మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు పుట్టుకొచ్చారు.
ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉందంటే దానికి చిరంజీవే కారణం. అయితే ఆయన సినీ కెరీర్ లో తన కుటుంబంలోని ప్రతి ఒక్కరితో నటించేందుకు చిరు ఆసక్తి చూపించారు. తన తమ్ముళ్లు పవన్ కల్యాణ్, నాగాబాబులతో కూడా నటించారు. అంతే కాకుండా అల్లు అర్జున్, రామ్ చరణ్ తో కూడా నటించారు.
కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. చిరంజీవి తన తండ్రి వెంకట్రావుతో కూడా నటించారు. వెంకట్రావు వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయినా.. ఆయనకు నటనమీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే చిరు అప్పట్లో నటించిన జగత్ కిలాడీలు అనే సినిమాలో వెంకట్రావు కూడా నటించారు.
Chiranjeevi Acted In Movie Jagath Kiladeelu With His Father Venkat Rao
ఈ సినిమా తర్వాత మరో సినిమాలో ఆయన నటించలేదు. తనకున్న కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వెంకట్రావు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక చిరంజీవి మాత్రం అంచెలంచెలుగా ఎదిగి ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పుడు మెగాస్టార్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు.
Read Also : Kasthuri Shankar : ఆ తెలుగు హీరో తాగి నా రూమ్ కు వచ్చాడు.. నటి కస్తూరి కామెంట్లు వైరల్…!
Read Also : Anchor Shiva : ఆంటీతో సె* చేశా.. యాంకర్ శివ సంచలన కామెంట్లు..!