Chiranjeevi And Ram Charan Multi Starrer Movie Update : చిరంజీవి టాలీవుడ్ మెగా స్టార్ గా ఎదిగాడు. ఈ ఏజ్ లోకూడా వరుసగా సినిమాలు చేసి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. అటు రామ్ చరణ్ అయితే ఏకంగా గ్లోబల్ రేంజ్ కు వెళ్లిపోయాడు. తిరుగులేని ఇమేజ్ తో అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు ఈ తండ్రీ కొడుకులు. అయితే రామ్ చరణ్ తో కలిసి ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేసి సూపర్ హిట్ కొట్టాలనే కోరిక చిరంజీవికి ఉంది.
ఆచార్య సినిమాతో ఆ ఛాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు మరో సంచలన దర్శకుడితో చరణ్-చిరంజీవి మల్టీ స్టారర్ చేయబోతున్నారంట. ఆ డైరెక్టర్ ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు. ఆయన ఎవరో కాదు ప్రశాంత్ నీల్.
రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ ను చిరంజీవి, చరణ్ కలిసారు. చిరంజీవి మనసులో మాట చెప్పడంతో ప్రశాంత్ నీల్ కూడా.. అంత పెద్ద స్టార్లతో కలిసి పని చేసే ఛాన్స్ ను వదులుకోవద్దని డిసైడ్ అయ్యాడు. అందుకే వారికి మూడు కాన్సెప్ట్ లు చెప్పాడంట. అందులో ఒకటి బాగా నచ్చడంతో చరణ్, చిరు దాన్ని డెవలప్ చేయమని చెప్పారంట.
Chiranjeevi And Ram Charan Multi Starrer Movie Update
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ టీమ్ ఆ పనిలోనే ఉందంట. ఇందులో మెయిన్ హీరోతో పాటు సైడ్ హీరో కూడా ఉంటాడని తెలుస్తోంది. అదరిపోయే ట్విస్ట్ తో ఆ సెకండ్ హీరో ఎంట్రీ ఉంటుందంట. ఈ విషయమే ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. కానీ ఈ మూవీ తెరపైకి వెళ్లడానికి మరో ఐదేండ్లకంటే ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. అప్పటికైనా ఈ మూవీ తెరపైకి వెళ్తే చాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో.