Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర. సినిమాల్లో ఆయనది చెరగని ముద్ర. ఎన్ని తరాలు వచ్చినా సరే ఎన్టీఆర్ గురించి కథలు, కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఎన్టీఆర్ ను చూస్తే ఏడుకొండల వెంకటేశ్వరుని చూసినట్టే అని అంతా భావించేవారు. అలాంటి ఎన్టీఆర్ కూడా ఓ స్టార్ హీరో కాళ్లు మొక్కారంట.
ఆయన ఎవరో కాదు చిత్తూరు నాగయ్య. ఎన్టీఆర్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరో అయ్యారు నాగయ్య. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అందరికంటే ఎత్తులో నిలబడ్డారు. కాగా ఓ రోజు నాగయ్య షూటింగ్ కు రాకపోయేసరికి ఏమైందో తెలియక ఏఎన్నార్ కు ఫోన్ చేశారు ఎన్టీఆర్. దాంతో ఏఎన్నార్ నేరుగా నాగయ్య ఇంటికి వెళ్లారు.
అప్పుడే నాగయ్యకు పద్మ శ్రీ అవార్డు వచ్చిందనే విషయం ఏఎన్నార్ కు తెలిసింది. అదేంటి మాకు చెప్పలేదు అని ఏఎన్నార్ అడిగారంట. అప్పటి నుంచే నాగయ్యకు అవార్డు వచ్చిన సంగతి ఇండస్ట్రీ మొత్తం తెలిపోయింది. ఈ క్రమంలోనే నాగయ్య షూటింగ్ కు రాగానే ఎన్టీఆర్ వెళ్లి కలిసారు.
అదేంటంటి మాకు ఈ విషయం చెబితే మీకు సన్మాన సభ ఏర్పాటు చేసేవాళ్లం కదా అంటూ అడిగారు. అప్పుడు నాగయ్య మాట్లాడుతూ.. మీరు నా కంటే పెద్ద నటుడు. మీకు కూడా అవార్డు వస్తే బాగుండు అని అన్నారు. ఆ మాటలకు కన్నీళ్లు ఆపుకోలేని ఎన్టీఆర్ సెట్స్ లో అందరు చూస్తుండగానే నాగయ్య కాళ్లు మొక్కారు. అంటే ఆయనకు నాగయ్య అంటే ఎంత అభిమానమో అర్థం అవుతుంది.
Read Also : SS Rajamouli : ఆ హీరోతో సినిమా కోసం ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా.. రాజమౌళి కామెంట్లు వైరల్..!
Read Also : Rana Daggubati : అలా చేస్తే తప్పేంటి.. శ్రీరెడ్డితో వివాదంపై స్పందించిన రానా..!