Choreographer Rakesh Master : రాకేష్ మాస్టర్ కు మొదటి నుంచి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఆయన కూడా సాధారణ స్థాయి నుంచి వచ్చారు. ఇంకా చెప్పాలంటే పేదరికపు స్థాయి నుంచి లెజెండరీ కొరియోగ్రాఫర్ స్థాయిదాకా ఎదిగారు. ఆయన సినిమాల్లోకి రాకముందు చిన్న వయసులో చాలా కష్టాలు పడ్డారంట. సొంత ఇల్లు కూడా లేకపోవడంతో.. చాల రకాల పనులు చేసి ఇల్లు కట్టుకున్నారు.
ఇక శవాల ముందు డప్పులు కొడితే వెళ్లి డ్యాన్స్ చేసేవారంట. అంతే కాకుండా ఆ శవాల మీద చల్లే చిల్లరను తీసుకుని ఆ రోజు సినిమా చూడటానికి వెళ్లేవాడు రాకేష్ మాస్టర్. అలా ఆయన చాలా సినిమాలను చూసేవారు. సినిమాలు అంటే ఆయనకు చాలా పిచ్చి. దాంతో డ్యాన్స్, యాక్టింగ్, భరత నాట్యం ఇలా అన్నీ నేర్చుకున్నారు.
ఆయన మల్టీ ట్యాలెంట్ చూసి హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన చెన్నై వెళ్లి డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్ పెట్టాడు. చాలా కొద్ది కాలంలోనే ఫేమస్ అయ్యాడు. ఓ సినిమాలో ఛాన్స్ కూడా వచ్చింది. కానీ కొందరు ఆయన్ను బెదిరించడంతో హైదరాబాద్ వచ్చి ఇక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టాడు. అల్లరి నరేష్, ప్రభాస్ లాంటి చాలామంది హీరోలకు ఆయన డ్యాన్స్ నేర్పించారు.
మొదటిసారిగా చిరునవ్వుతో సినిమాలో వేణు తొట్టెంపూడి అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. చాలా సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా చేశారు. కానీ ముక్కుసూటి తనం వల్ల ఆయన ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ మొత్తం పడిపోయింది. చివరకు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
Read Also : Tejaswi Madivada : టాప్ విప్పేసి పడుకోమన్నాడు.. తేజస్వి మదివాడ సంచలన ఆరోపణలు..!
Read Also : JD Chakravarthy : పెళ్లి అయిన హీరోయిన్ పై మోజు పడ్డ జేడీ చక్రవర్తి.. ఆ పని కోసం వేధింపులు..!