Clubhouse: క్లబ్ హౌజ్.. సరికొత్త సోషల్ మీడియా..

Clubhouse: మనం ఇప్పటివరకు చాలా సోషల్ మీడియాలను చూశాం. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, లింక్డిన్.. ఇలా. ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. అక్షరాల రూపంలో, ఫొటోలు-వీడియోల రూపంలో ఓపెన్ గా మన భావాలను ప్రపంచంతో పంచుకోవటానికి మొదట్లో ఫేస్ బుక్, అనంతరం ట్విట్టర్.. ఈవిధంగా ఒక దాని తర్వాత ఒకటి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతి చిన్న, పెద్ద డెవల్మెంటూ ఈ సోషల్ మీడియా ద్వారానే వరల్డ్ వైడ్ గా క్షణాల్లో తెలిసిపోతోంది. సామాన్యుడు, […].

By: jyothi

Published Date - Tue - 18 May 21

Clubhouse: క్లబ్ హౌజ్.. సరికొత్త సోషల్ మీడియా..

Clubhouse: మనం ఇప్పటివరకు చాలా సోషల్ మీడియాలను చూశాం. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, లింక్డిన్.. ఇలా. ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. అక్షరాల రూపంలో, ఫొటోలు-వీడియోల రూపంలో ఓపెన్ గా మన భావాలను ప్రపంచంతో పంచుకోవటానికి మొదట్లో ఫేస్ బుక్, అనంతరం ట్విట్టర్.. ఈవిధంగా ఒక దాని తర్వాత ఒకటి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రతి చిన్న, పెద్ద డెవల్మెంటూ ఈ సోషల్ మీడియా ద్వారానే వరల్డ్ వైడ్ గా క్షణాల్లో తెలిసిపోతోంది. సామాన్యుడు, సెలెబ్రిటీ అందరూ ఒక వేదిక మీదికి వస్తున్నారు. ఇదే క్రమంలో లేటెస్టుగా.. ఆడియోల రూపంలో మన అభిప్రాయాలను షేర్ చేసుకోవటానికి క్లబ్ హౌజ్ అనే ఒక సరికొత్త సామాజిక మాధ్యమం తెర మీదికి వచ్చింది.

ఏడాదిలోనే.. ఎంతో ప్రజాదరణ..

అమెరికాలోని ‘ఆల్ఫా ఎక్స్ ప్లొరేషన్ కో’ అనే సంస్థ ఈ క్లబ్ హౌజ్ అనే సోషల్ ప్లాట్ ఫామ్ ని రూపొందించింది. ఈ యాప్ ని యాపిల్ ఐఓఎస్ వినియోగదారుల కోసం ఏడాది కిందటే(2020 మార్చిలోనే) రిలీజ్ చేశారు. దీంతో ఇది అతికొద్ది కాలంలోనే జనంలోకి బాగా చొచ్చుకుపోయింది. యూఎస్ఏలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గతవారం విడుదల చేశారు.

మన దేశంలో..

ఇండియాలోని ఆండ్రాయిడ్ కస్టమర్ల కోసం కూడా ఈ క్లబ్ హౌజ్ యాప్ ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ సంసిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 21న శుక్రవారం మనం కూడా దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ప్రీ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఒకేసారి ఏకంగా 5,000 మందితో చాట్ రూమ్ ని ఏర్పాటుచేసుకునే స్పెషల్ ఫీచర్ ఈ క్లబ్ హౌజ్ సొంతం. జపాన్, బ్రెజిల్, రష్యాలో నిన్న మంగళవారం నుంచే అందుబాటులోకి రాగా నైజీరియా, ఇండియాలో శుక్రవారం రోజు, మిగతా దేశాలకు ఈ వారం మొత్తం, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రపంచవ్యాప్తంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

Read Today's Latest News News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News