Health Tips : మనకు తెలిసిన మోస్ట్ పాపులర్ హాట్ డ్రింగ్ ఏది అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు కాఫీ.. దీనికి ఎప్పుడు ఈ విషయంలో మొదటి స్థానం ఉంటుంది.. ఇక చాలా మందికి ఉదయం లేవగానే చాయ్ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. ఇది పొద్దున్నే పడకపోతే ఆ రోజంతా ఎలానో ఉంటుంది.. ఈ ఫీలింగ్ మనలో చాలా మందికి వస్తుంది. టీ తాగే వారు టీ.. కాఫీ తాగే వారు కాఫీ తాగకపోతే రోజంతా పని కూడా చేయబుద్ది కాదు..
ఉదయాన్నే ఎక్కడికైనా బయటకు వెళ్లినా లేదంటే వాతావరణం చల్లగా ఉన్న వేడి వేడిగా టీ లేదా కాఫీ తాగాలని అనిపిస్తుంది.. అయితే కాఫీ వల్ల అనేక బెనిఫిట్స్ సైతం ఉన్నాయని తెలుసా.. ఈ కాఫీ బరువు తగ్గించడంలో సహకరిస్తుందట. మరి ఈ విషయం తెలియక చాలా మంది ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతూ బరువు తగ్గేందుకు కాస్త పడుతున్నారు.
అయితే కాఫీలో కెఫీన్ ఉంటుంది కొవ్వును కరిగించడంలో చాలా హెల్ప్ చేస్తుందట.. మెటాబాలిజాన్ని 3-11 శాతం మెరుగు పరుస్తుంది.. జీవక్రియ రేటును పెంచుతుంది.. అంటే కాఫీ తాగితే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు ఉదయాన్నే వ్యాయామాలు చేసే గంట ముందు కాఫీ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు..
కాఫీ వల్ల కొవ్వు కరగడమే కాదట.. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, రియాక్షన్ టైం పెంచుతుందట.. కాఫీలో మాంగనీస్, పొటాషియం, B2, B3, B5 వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయట.. అయితే రోజుకు 2 లేదా 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు, గర్భవతులు, కాఫీ ఎక్కువుగా తాగకూడదు..
Read Also : Health Tips : వింటర్ లో ఆస్తమా ఉన్నవారు ఈ కేర్ తీసుకోకపోతే ఇక అంతే.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Read Also : Astrology : శని దేవుడి స్థాన మార్పిడి ఈ 3 రాశులను కష్టాలలోకి నెట్టేయనుందా.. ఆ రాశులు ఏవంటే?