Viral News : ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్న లేదంటే ఆరోగ్యం బాలేకపోయినా ఇంకా ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో మనం పని చేసే చోట ఉద్యోగులు పై అధికారులను లీవ్ అడుగుతారు.. పరిస్థితులను బట్టి మనకు అధికారులు సెలవలు మంజూరు చేస్తారు.. అయితే కొన్ని కొన్ని సార్లు అధికారులకు ఉద్యోగులు చాలా సిల్లీ రీజన్స్ చెబుతూ ఉన్నారు..
ఇటీవల కాలంలో సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లోనే వైరల్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగిన కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మనకు తెలిసి పోతుంది.. మరి తాజాగా ఒక వ్యక్తి సిల్లీ రీజన్ చెప్పి లీవ్ అడిగిన లీవ్ లెటర్ నెట్టింట వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒక కానిస్టేబుల్ భార్యను బుజ్జగించేందుకు పై అధికారులను లీవ్ అడిగారు.. ఇప్పుడు ఈ లెటర్ నెట్టింట ఫుల్ ఫేమస్ అవ్వడమే కాదు నవ్వులు పూయిస్తుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన గౌరవ్ అనే వ్యక్తి 2016లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధుల్లోకి చేరారు. ఈయన ప్రెజెంట్ నౌత్వానా పరిధిలో డ్యూటీ చేస్తున్నాడు..
ఈయనకు గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులకే డ్యూటీలో జాయిన్ అయ్యాడు.. జనవరిలో తన మేనల్లుడి పుట్టిన రోజు ఉండడంతో వారం రోజులు లీవ్ పెట్టి వస్తానని భార్యతో చెప్పాడు.. కానీ ఆమె భార్య గౌరవ్ పై చిరు కోపంతో మాట్లాడకుండా ఆయన కాల్స్ కు స్పందించడం లేదు..
దీంతో అలిగిన భార్యను బుజ్జగించుకునేందుకు కానిస్టేబుల్ లీవ్ లెటర్ రాసారు.. పెళ్లి అయ్యి నెల కాకుండానే వచ్చినందుకు భార్య అలిగింది అని బుజ్జగించు కోవాలని అందుకే నాకు సెలవు కావాలని ఎస్పీకి రాసిన లేఖ నెట్టింట వైరల్ అయ్యింది. ఈ లేఖకు స్పందించిన అధికారి కూడా 5 రోజులు లీవ్ ఇచ్చాడు.. దీంతో కానిస్టేబుల్ ఫుల్ ఖుషీగా ఆయన భార్యను బుజ్జగించు కునేందుకు వెళ్ళాడు..
Also Read : Samantha Ruth Prabhu : పాపం సమంత ఆ వ్యాధి వల్ల ఎంతలా భాదపడుతుందో ..చూడండి !
Also Read : Ramya Krishnan : జాకెట్ లేకుండా ఫోజులిచ్చిన రమ్యకృష్ణ.. ఈ వయసులో ఇవేం పనులు..!