Health Tips : చాలా మంది ఇప్పుడు ఆరోగ్యం మీద ద్రుష్టి పెడుతూ కొన్ని కొన్ని చిట్కాలను ఉపయోగిస్తున్నారు.. మరి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటి.. రాగి పాత్రల్లో నీటిని తాగడం చాలా మంచిది అని చాలా మంది నమ్ముతున్నారు.. అయితే నిజంగానే రాగి పాత్రల్లో నీటిని తాగడం మంచిదా? కాదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
హెల్త్ లైన్ ప్రకారం.. రాగి ఒక ముఖ్యమైన పోషకం.. శరీరం లోని శక్తిని ఉత్పత్తి, మెదడు యొక్క పని తీరును నిర్వహించడంలో రాగి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. పొటాటో, డార్క్ చాక్లెట్, మాంసాలు వంటి ఆహారాల్లో రాగి అధిక మొత్తంలో ఉంటుంది.. డైటీషియన్ ప్రకారం.. రాగి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్స్ క్రమబద్దం చేస్తుంది, బరువు తగ్గడానికి మరియు అల్సర్ నివారణకు సహాయపడుతుంది, వ్యాధినిరోధకతను పెంచుతుంది, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది.
రాగిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.. రాగి పాత్రలో ఉంచిన నీరు ఆల్కలీన్ గా ఉంటుంది కాబట్టి దీనిని తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల శరీరం లోని వాత, పిత్త, కఫాలను నయం చేస్తుంది..
ఆహారం జీర్ణం అవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ విడుదల అయ్యి వేడిని ఉత్పత్తి చేస్తుంది.. నిపుణులు చెబుతున్న ప్రకారం అన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఖాళీ పొట్టతో ఉదయాన్నే పరగడుపున తాగండి.. అయితే రాగి శరీరానికి చిన్న మొత్తంలో అవసరమయ్యే మినరల్.. అందుకే తక్కువ మొత్తంలోనే దీనిని తీసుకోవాలి..
Also Read : KGF 3 : బ్లాస్టింగ్ న్యూస్.. కేజీఎఫ్-3 వచ్చేది అప్పుడే.. కీలక అప్ డేట్ ఇచ్చిన నిర్మాత..!
Also Read : Vastu Tips : ఇల్లు, ఆఫీస్ లలో వెండి ఏనుగును ఈ ప్రదేశంలో పెట్టండి.. సిరి, సంతోషాలకు కొదవే ఉండదు..