Covid : ఆ కంపెనీ పేరు.. తెలియనివారు లేరు..

Covid : గాచారం బాగలేకపోతే గోచిలో పిడుగు పడుతుందనేది జోక్. అదే గాచారం బాగుంటే గ్లోబల్ స్టార్ అయిపోవచ్చు. అది కూడా ఓవర్ నైట్ లోనే. ఈ సామెత కొవిడ్ అనే కంపెనీకి సరిగ్గా సరిపోతుంది. కొవిడ్ అనే పేరు తెలియనివారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేరంటే అతిశయోక్తి కాదు. అది ఒక వైరస్ అని ఎవరైనా చెబుతారు. కానీ కొవిడ్ పేరుతో ఒక సంస్థ ఉందనే విషయం మాత్రం 99.99 శాతం మందికి తెలియదు. కొవిడ్ […].

By: jyothi

Published Date - Mon - 24 May 21

Covid : ఆ కంపెనీ పేరు.. తెలియనివారు లేరు..

Covid : గాచారం బాగలేకపోతే గోచిలో పిడుగు పడుతుందనేది జోక్. అదే గాచారం బాగుంటే గ్లోబల్ స్టార్ అయిపోవచ్చు. అది కూడా ఓవర్ నైట్ లోనే. ఈ సామెత కొవిడ్ అనే కంపెనీకి సరిగ్గా సరిపోతుంది. కొవిడ్ అనే పేరు తెలియనివారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేరంటే అతిశయోక్తి కాదు. అది ఒక వైరస్ అని ఎవరైనా చెబుతారు. కానీ కొవిడ్ పేరుతో ఒక సంస్థ ఉందనే విషయం మాత్రం 99.99 శాతం మందికి తెలియదు. కొవిడ్ అనే పేరుతో అమెరికాలోని అరిజోనా ప్రావిన్స్ లో ఒక కంపెనీ ఉంది. వైరస్ పుణ్యమా అని ఆ సంస్థ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది.

40 ఏళ్ల కిందటే..

కొవిడ్ అనే పేరుతో ఈ కంపెనీని 40 ఏళ్ల కిందటే స్థాపించారు. అందులో ఆడియో విజువల్ వాల్ ప్లేట్లను, కేబుళ్లను తయారు చేస్తుంటారు. ఈ సంస్థ సీఈవో నార్మ్ కార్సన్. ఈయన గతేడాది ఆరంభంలో ఒకసారి ఆమ్ స్టర్ డామ్ లో జరిగిన విజువల్ షోలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ అందరూ కొవిడ్.. కొవిడ్.. అని అనుకుంటూ ఉంటే ఈయనేమో తన కంపెనీ గురించే మాట్లాడుకుంటున్నారమో అని సంతోషపడ్డాడు. తీరా అదొక మహమ్మారి పేరు అని తెలిసి ఆశ్చర్యపోయాడంట.

Covid : covid is not only a virus name. it is also a company name

Covid : covid is not only a virus name. it is also a company name

కరోనా టెస్టులు చేస్తారా? : Covid

ఈ సంస్థ వ్యవస్థాపకుడు దీనికి మొదట వీడియో కంపెనీ అని గానీ వీడియో ఫర్ షార్ట్ అనే పేరు గానీ పెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే చాలా సంస్థల పేర్లు ఇలాగే ఉండటంతో ఒక కార్మికుడి సలహా మేరకు కొవిడ్ అనే పేరు పెట్టాడు. ఇన్నాళూ ఈ సంస్థ పేరు పంపిణీదారులకు, డీలర్లకు, కస్టమర్లకు మాత్రమే తెలుసు. కానీ గతేడాది నుంచి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. కాకపోతే కంపెనీ గోడ మీద ఉన్న కొవిడ్ అనే పేరు చూసి ఇక్కడ కరోనా టెస్టులు చేస్తున్నారా? లేక కరోనాపై రీసెర్చ్ చేస్తున్నారా అంటూ చాలా మంది అడుగుతున్నారని సీఈవో నార్మ్ కార్సన్ వాపోతున్నాడు. కొందరైతే ఈ పేరు మార్చుకోవాలంటూ సూచనలు కూడా చేస్తున్నారని, అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పని మాత్రం చేయను అని తెగేసి చెప్పారు.

Related News