Farmer: దేశం గర్వించ‌ద‌గ్గ రైతు.. ఎద్దుల బండితో కరెంట్ ఉత్పత్తి!

Farmer: భారతదేశం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పని చేస్తుంటుంది. మనదేశంలో నేటికి 50 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు..

By: jyothi

Published Date - Sat - 24 September 22

Farmer: దేశం గర్వించ‌ద‌గ్గ రైతు.. ఎద్దుల బండితో కరెంట్ ఉత్పత్తి!

Farmer: భారతదేశం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై పని చేస్తుంటుంది. మనదేశంలో నేటికి 50 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. ఇప్పడిప్పుడే దేశంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కతోంది. కొత్త కొత్త ఆవిష్కణలు ఉద్భవిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అధిక దిగుబడులను సంపాదిస్తున్నారు. రైతులు ఒకప్పుడు సంప్రదాయ వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు వారి ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. వీరు కూడా యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నారు.

రైతు ఆవిష్కరణకు సలాం..

మనదేశంలో ఆవిష్కణలు కొత్తగా ఉద్భవించినవి కావు. ప్రపంచానికి నాగరికత తెలిపిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. వారు నేర్పిన వ్యవసాయ పద్ధతులు నేటికి కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. ఒకప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేస్తే ప్రస్తుతం ట్రాక్టర్లతో చేస్తున్నారు. మరికొద్ది రోజులైతే మొత్తం మిషనరీలతోనే వ్యవసాయం చేయడాన్ని రైతులు అలవర్చుకుంటారు.

తాజాగా ఓ రైతు భూమికి నీళ్లు పెట్టడానికి ఎద్దుల బండికి టెక్నాలజీని సాయం తీసుకున్నాడు. దీనితో కరెంట్ కూడా ఉత్పత్తి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయ్యింది. అసలు దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఓ రైతు ట్రేడ్‌మిల్ యంత్రానికి సంబంధించిన బెల్ట్‌ను ఎద్దుల బండికి అమర్చారు. ఆ బెల్టుపై ఎద్దును నడిపిస్తున్నాడు.

ఇలా చేయడం వలన పంటకు కావాల్సిన నీటిని తోడుతున్నాడు. బెల్డ్ ద్వారా కింద ఉన్న నీరు పైపుల ద్వారా పంటకు చేరుతుంది. దీంతో కరెంట్ లేని టైంలో కూడా పంటకు నీటిని అందిస్తున్నాడు. అదేవిధంగా మోటర్లను అమర్చి కరెంట్‌ను సైతం ఉత్పత్తి చేస్తున్నాడు. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వ్యవసాయానికి వాడుతున్నాడు. ఈ రెండు అద్బుత ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా కొందరు ఆ రైతు ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.

Read Also : Varsha-emmanuel : ఇమ్మాన్యూయెల్ కోసం స్టేజిపైనే ఏడ్చేసిన వ‌ర్ష‌.. ఐయామ్ సారీ అంటూ..!

Read Alsoo : Sreemukhi : ఆ హీరోకు ఐలవ్ యూ చెప్పిన శ్రీముఖి.. బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందిపో..!

Read Today's Latest News News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News