Deepika Padukone Dated Ranbir Kapoor For Four Years : బాలీవుడ్ లో డేటింగ్ వ్యవహారాలు, లవ్ బ్రేకప్ లు అనేవి చాలా కామన్. అక్కడ హీరో, హీరోయిన్లు ఒకరి కంటే ఎక్కువ మందితో డేటింగ్ చేస్తూ ఉంటారు. కొందరు పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం పెళ్లి చేసుకోకుండా కేవలం డేటింగ్ ల పేరుతోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పట్లో దీపికా పదుకొణె-రణ్ బీర్ కపూర్ కూడా ఇలాగే ఎంజాయ్ చేశారు.
వీరిద్దరూ పబ్లిక్ గానే తిరిగారు. పైగా నాలుగేండ్ల పాటు డేటింగ్ చేశారు. పెళ్లిచేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ చివరకు విడిపోయారు. కాగా దీపికా రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. అటు రణ్ బీర్ కూడా ఆలియా భట్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే రణ్ బీర్-దీపికా విడిపోయిన తర్వాత మాత్రం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
నాలుగేళ్లు డేటింగ్ చేశా..
అప్పట్లో రణ్ బీర్ కపూర్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమరాం రేపాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు దీపికాతో రిలేషన్ ఎలా ఉండేది అని అడగ్గా… దానికి ఆయన ఓపెన్ అయ్యారు. దీపికాతో నేను నాలుగేండ్లు డేటింగ్ చేశాను. రెండేళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్నాం. ఆమె నా స్వచ్ఛమైన ప్రేమను మోసం చేసింది.
ఆమె యాక్టింగ్ చూస్తే నాకు చిరాకేస్తుంది. రియల్ లైఫ్ లో కూడా ఆమె యాక్టర్ గానే ఉంటుంది. అదే నాకు నచ్చలేదు. నేను ఎప్పుడూ ఆమెను అమేజింగ్ గర్ల్ గానే చూశాను. కానీ ఆమె ప్రేమలో నిజాయితీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు రణ్ బీర్ కపూర్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.