ప్రతి తల్లిదండ్రుల ఆరాటం తమ పిల్లల బుద్ధి చురుకుగ్గా పనిచేయాలి, పరీక్షల్లో మంచి మార్కులు.. ర్యాంకులు సాధించాలి ఇదే అందరి లక్ష్యం. అయితే పిల్లలందరీ బుద్ధి ఒకేలాగ పనిచేయదు. అవసరమైనప్పుడు బుద్ది చురుకుగ్గా పనిచేస్తే చాలు అన్నింటా విజయం సాధించవచ్చు. దీనికోసం మన పూర్వీకులు ఒక సులభ పరిష్కారం చేప్పారు అది ఏమిటో తెలుసుకుందాం… బుద్ధి ప్రదాత గణపతి అని అందరికీ తెలుసు అయితే గణపతికి సంబంధించిన 32 రూపాలలో బాలగణపతిని ఆరాధిస్తే మీ బుద్ధి, మీ పిల్లల బుద్ధి బాగా చురుకుగా పనిచేస్తుంది. ఆ విశేషాలు…
బాల గణపతి – ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.
చదవాల్సిన శ్లోకం
‘‘కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్’’
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి. స్వామికి షోడశోపచార పూజలు చేసిన తర్వాత అవకాశం ఉంటే అరటిపండు, పనసతొన, మామిడిపండు, చెరకుగడలో ఏదో ఒకదానిని నైవైద్యేంగా స్వామికి సమర్పించాలి. పూజ అనంతరం మీ పిల్లలకు వాటిని ప్రసాదంగా పెట్టాలి. దీనివల్ల మీ పిల్లల బుద్ధి చాలా చురుకుగా స్పందిస్తుంది. ప్రతిరోజు స్వామిని ఆరాధించాలి. కనీసం ఇలా ఒక ఏడాది అదీ వీలుకాకుంటే 40 రోజులు నియమంగా చేసి చూడండి. తప్పక స్వామి అనుగ్రహం లభిస్తుంది. కొందరికి మరికొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ స్వామిని ఇలా
భక్తితో, శ్రద్ధతో ఆరాధన చేయండి. తప్పక మంచి ఫలితాన్ని పొందుతారు.