Divi Vadthya : సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ దానిపై కొందరు మాత్రమే సమాధానం చెబుతారు. వీలైనంత వరకు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇలాంటి వాటికి దూరంగానే ఉంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ దివి కూడా దీనిపై స్పందించింది.
ఆమె బిగ్ బాస్ కు ముందు రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు సాధించలేదు. అలాంటి సమయంలోనే ఆమెకు బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వచ్చింది. ఇక బిగ్ బాస్ తర్వాత పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో చేస్తోంది. హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు రావట్లేదు గానీ నటిగా బాగానే వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మరోసారి కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎవరి దారి వారు ఎంచుకుంటారు. అందులో తప్పులేదు. కమిట్ మెంట్లు అనేవి ఇష్టపూర్వకంగానే జరుగుతాయి. ఇవ్వకపోతే ఎవరూ బలవంతం చేయరు.
కాబట్టి ఒకసారి కమిట్ మెంట్ ఇస్తే మళ్లీ దానిపై మాట్లాడే హక్కు ఎలా ఉంటుంది. దాన్ని అందరూ గమనించాలి. ఇక్కడ బలవంతంగా ఏ ఇద్దరూ కలుసుకోరు. కాబట్టి దాన్ని పెద్ద తప్పుగా చూపించాల్సిన అవసరం లేదు. చాలామంది ట్యాలెంట్ తోనే అవకాశాలు అందుకుంటున్నారు. దాన్ని కూడా మనం చెప్పుకోవాలి అంటూ తెలిపింది దివి.
Read Also : Jabardasth Show : జబర్దస్త్ ను నిలబెట్టిన ఒకే ఒక్కడు.. సుధీర్, ఆదిలు మాత్రం కాదు.. ఎవరంటే..?
Read Also : Arjun Reddy : అర్జున్ రెడ్డి సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?