Divyansha Kaushik : కొన్ని రోజులుగా చైతూ విషయం వచ్చినప్పడల్లా దివ్యాంశ కౌశిక్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె ఈ నడుమ చైతూతో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. సమంతతో చైతూ విడిపోయినప్పటి నుంచి దివ్యాంశ కౌశిక్ , చైతూ రెండు, మూడు సార్లు బయట కనిపించాడు. అప్పటి నుంచే ఇద్దరూ ప్రేమలో ఉన్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో చైతూతో కలిసి మజిలీ సినిమాలో నటించింది దివ్యాంక. ఈ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. కానీ అప్పటి నుంచే ఇద్దరి నడుమ సంథింగ్ అంటూ కొందరు వార్తలు రాశారు. ఇక సమంతతో విడిపోయాక ఇవి ఎక్కువ అయిపోయాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీటిపై స్పందించింది. ఈ భామ.
ఆమె మాట్లాడుతూ.. నాకు సంబంధం లేని కొన్ని విషయాల్లో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. వాస్తవంగా నాగచైతన్యపై నాకు మంచి క్రష్ ఉంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐలవ్ హిమ్. కానీ ఆయనతో నేను ప్రేమలో లేను. ఇందులో ఎలాంటి నిజం లేదు. చాలా హంబుల్ పర్సన్.
అందరితో స్నేహంగా ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి లేనిపోనివి రాయొద్దు అంటూ తెలిపింది దివ్యాంక. ఆమె చేసిన కామెంట్లతో చైతూకు తనకు ఎలాంటి సంబంధం లేదని అర్థం అయిపోయింది. ఇప్పుడు దివ్యాంశ కౌశిక్ అటు తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఆమె తెలుగులో మరో సినిమా చేయబోతున్నట్టు తెలిపింది.
Read Also : Actress Avika Gor : నాకు ఏడుసార్లు పెళ్లి చేశారు.. లైఫ్ నాశనం చేశారు.. అవికా గోర్ ఎమోషనల్ ..!
Read Also : Jabardasth Hari : ఎర్ర చందనం స్మగ్లర్ గా మారిన జబర్దస్త్ కమెడియన్.. పరారీలో ఉన్న నటుడు..!