Donal Bisht Comments On Tollywood Director : ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది సౌత్ ఇండస్ట్రీకి కూడా బాగానే పాకింది. ఇక్కడ కూడాచాలామంది ఈ మహమ్మారిని ఎదుర్కుంటున్నారు. అప్పట్లో దీనిపై పెద్దగా స్పందించేవారు కాదు. కానీ మీటూ ఉద్యమం తర్వాత మాత్రం చాలామంది దీనిపై నోరు విప్పుతున్నారు. ఒక్కొక్కరు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకున్నారు.
ఇక తెలుగు ఇండస్ట్రీపై కూడా చాలానే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ నటించి బాలీవుడ్ కు వెళ్తున్న ముద్దుగుమ్మలు.. అక్కడి మీడియాతో ఇక్కడి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు డోనల్ బిష్త్.
ఆమె హిందీలో ఇప్పుడు బిజీ యాక్టర్. అయితే రీసెంట్ గా ఓ ఇంగ్లిష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను బాలీవుడ్ లో మాదిరిగానే సౌత్ లో కూడా అవకాశాల కోసం ట్రై చేశాను. తెలుగులో ఓ సినిమాలో ఛాన్స్ కోసం ఆడిషన్స్ కు వెళ్లాను. అక్కడ నన్ను చూసిన మూవీ డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇస్తానని చెప్పాడు.
నేను సంతోషపడ్డాను. కానీ అంతలోనే షాక్ ఇచ్చాడు. తనతో ఒక రోజు రాత్రి గడపాలని కోరాడు. దాంతో అక్కడి నుంచి వచ్చేశాను. మళ్లీ బాలీవుడ్ కు రిటర్న్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడే ఛాన్సులు వస్తున్నాయి. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది అంటూ కామెంట్లు చేసింది ఈ బాలీవుడ్ భామ. కానీ ఆ తెలుగు డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.