Sankranti : న్యూ ఇయర్ సంబరాలు ముగిసాయి.. ఇక రేపటి నుండి సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సంక్రాంతిని బాగా జరుపు కుంటారు అనే విషయం తెలిసిందే.. మన తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగల్లో ఇది ఒకటి.. సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలో సంచరిస్తాడు..
అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అని పిలుస్తారు.. ఇక ఈ పండుగ రోజు మీరు ఇప్పుడు చెప్పుకోబోయే పనుల చేయడం మంచిది.. కొన్ని రెమిడీస్ వల్ల మీరు లాభాలు పొందవచ్చు. మరి అందుకే సంక్రాంతి రోజు ఏం చేయాలో చూద్దాం..
మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే లేవగానే శివలింగానికి జలం సమర్పించడం వల్ల మీ జీవితం లోని సమస్యలన్నీ తొలగి పోతాయి.. కాబట్టి దీనిని తప్పకుండ చేస్తే ఈ ఏడాదంతా సంతోషంగా ఉండవచ్చు..
అలాగే పండుగ రోజు చెట్లకు, తులసి మొక్కకు నీరు సమర్పించి పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు, సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందట..
సంక్రాంతి పండుగ రోజు నువ్వుల నూనెతో స్నానం చేయడం శుభప్రదం.. నువ్వులు శని దేవుడికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి శని సమస్య నుండి విముక్తి పొందడానికి నువ్వుల నూనె స్నానం చేయడం మంచిదట.. శని దేవుడికి ఇష్టమైన నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేయడం వల్ల శని సమస్యలు తొలగి పోతాయట..
అలాగే ఇదే రోజు పాలు, బెల్లం కలిపి అన్నం చేసి తింటే సూర్యుడి అనుగ్రహం లభించి జాతక సమస్యలు తీరుతాయట.. ఇంకా అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే నువ్వులను పేస్టులాగా చేసుకుని శరీరానికి పట్టించి స్నానం చేయడం మంచిది. అలాగే సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందట.
Read Also : Samantha : సమంత ఇలా మారిపోవడానికి కారణం ఆయనే.. ఎంత పని చేశాడు..!
Read Also : Kalyanam Kamaneeyam Movie Review : కల్యాణం కమనీయం సినిమా రివ్యూ..!