తెలుగు అమ్మాయి ఈషారెబ్బా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలు ఆమె సొంతం. కానీ ఎందుకో ఆమెకు స్టార్ హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ సినిమాల్లో సెకండ్, థర్డ్ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గానే ఆమె మలయాళంలో ఓ సినిమా కూడా చేసింది.
అయితే తెలుగులో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు రావట్లేదన్నది మాత్రం నిజం. ఈ విషయాన్ని తాజాగా ఈషా రెబ్బా కూడా ఒప్పుకుంది. ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు తెలుగులో అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.
తెలుగులో మాకు అవకాశాలు రావట్లేదన్నది వాస్తవం. దానికి కారణాలు ఏంటో నాకు తెలియదు. ఇక ఇండస్ట్రీ అన్న తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ గానే ఉంటుంది. నేను కూడా దాన్ని ఎదుర్కున్నాను. కానీ ఎప్పుడూ లొంగిపోలేదు. నా ట్యాలెంట్ ను నమ్ముకుని మాత్రమే పని చేస్తున్నాను.
ఇప్పుడు తాజాగా మరో సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఏదైనా సరే మనం ఎంచుకునే మార్గంలోనే మన ప్రయాణం ఉంటుంది. అవకాశాల కోసం ఆగిపోతే ప్రయాణం సాధ్యం కాదు. ఇవన్నీ నిర్ణయించుకున్న తర్వాతనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికీ నాకు పెద్దగా సపోర్టు లేదు. కానీ నాపై నాకు నమ్మకం మాత్రమే ఉంది అంటూ తెలిపింది ఈషా.
Read Also : Nikhil Siddhartha : భార్యతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. మొత్తానికి ఒప్పుకున్నాడు..!
Read Also : Karate Kalyani : మూడో పెళ్లికి నేను రెడీ.. బాయ్ ఫ్రెండ్ అయినా ఓకే అంటున్న కరాటే కల్యాణీ..!