Eesha Rebba : ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ అనే పేరు బాగానే వినిపిస్తోంది. మన తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రాకపోవడంపై ఎప్పటికప్పుడు వాయిస్ లు వినిపిస్తూనే ఉంటాయి. ఇక మీటూ ఉద్యమం తర్వాత చాలామంది దీనిపై ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు.
తాజాగా తెలుగు అమ్మాయి ఈషారెబ్బా కూడా దీనిపై స్పందించింది. ఆమె గతంలో హీరోయిన్ గా చేసింది. కానీ తెలుగులో ఎక్కువ రోజులు హీరోయిన్ గా రాణించలేకపోయింది. దాంతో ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. మొన్న మలయాళంలో ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది.
అయితే తెలుగులో అవకాశాలు రాకపోవడంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. తెలుగు అమ్మాయిలు కమిట్ మెంట్లు ఇవ్వరు. అందుకే వారికి ఎక్కువగా ఛాన్సులు రావట్లేదనే ఆరోపణల్లో నిజం లేకుండా పోలేదు.
కానీ ఇప్పటి వరకు నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదు. కేవలం నా ట్యాలెంట్ తోనే అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన వాటితో నేను సాటిస్ ఫై గానే ఉన్నాను. ఇతర భాషల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. కాబట్టి నేను వచ్చిన వాటితో ఇబ్బంది పడట్లేదు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది ఈషారెబ్బా.
Read Also : Mega Star Chiranjeevi : బలవంతంగా ఆ హీరోయిన్ తో చిరు లిప్ లాక్.. చివరకు భారీ ట్విస్ట్..!
Read Also : Charmy Kaur : హీరోయిన్ ఛార్మీ ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపిందో తెలుసా..?