Vastu Tips : మనిషి అన్నాక సమస్యలు లేకుండా అస్సలు ఉండరు.. సంతోషాలను మనం ఎలా స్వీకరిస్తామో కష్టాలను కూడా స్వీకరిస్తేనే జీవితంలో నిలబడ గలుగుతాము. లైఫ్ లో ఎప్పుడో ఒకసారైనా ఏదైనా చిన్న కష్టం వస్తూనే ఉంటుంది.. కష్టాలు వచ్చాయని మనం ఆలోచన శక్తిని కోల్పోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
కొంత మందికి ఆర్ధిక సమస్యలు ఉంటే మరికొంత మంది ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. ఇంకొంత మంది అయితే దాంపత్య జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు.. అయితే ఏ సమస్య అయినా సరే ఇంట్లో వెండి ఏనుగు బొమ్మను పెట్టుకుంటే ఆ సమస్యల నుండి బయట పడవచ్చని చెబుతున్నారు. మరి ఇల్లు కానీ, కార్యాలయం కానీ ఎక్కడైనా సరే వెండి బొమ్మను ఈ ప్రదేశంలో పెట్టుకుంటే చాలా సమస్యల నుండి బయట పడవచ్చట..
హిందూ మతంలో ఏనుగును గణేశుడి రూపంగా పరిగణిస్టారు. కాబట్టి ఏనుగును శుభానికి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.. ఏనుగును పూజిస్తే గణేశుడి అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతారు.. మరి వెండి ఏనుగు బొమ్మ కు సైజుతో సంబంధం లేదు.. ఏ సైజులో అయిన ఉండవచ్చు.. ఇంట్లో లేదా ఆఫీస్ లో పెట్టుకుంటే సమస్యలు పోతాయి.
వినాయకుడు అన్ని విఘ్నలను తొలగిస్తాడు అనే విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆయన్ను ప్రతి బింబించేలా వెండి ఏనుగు బొమ్మ ను ఇంట్లో పెట్టుకుంటే దాంతో అనేక విషయాల్లో మనం విజయం సాధించవచ్చు.. అన్ని సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.. సిరి, సంపదలకు లోటు లేకుండా చేస్తుందట..
వెండి ఏనుగు బొమ్మ ను ఇంట్లో ఉత్తరం వైపున పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు కూడా తొలగి పోతాయి. ఇంటి సభ్యులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటే వాటి నుండి బయట పడవచ్చు. ఆఫీస్ లో వెండి ఏనుగు బొమ్మను పెట్టుకుంటే ఆఫీసులో లేదా వ్యాపారం దగ్గర పెట్టుకుంటే అన్ని సమస్యలు తొలగి పోతాయట.
Read Also : Shaakuntalam Trailer Launch Event : శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత ఎమోషనల్ స్పీచ్…!
Read Also : Dil Raju : శాకుంతలం మూవీ ఒక అద్భుతమైన స్టోరీ ….దిల్ రాజు..!