Soundarya : సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు సౌందర్య. నటనలో ఆమెను కొట్టేవారే లేరు. ఎలాంటి సీన్లను అయినా సరే ఆమెలా ఎవరూ చేయలేరేమో అన్నంతగా మెప్పించింది ఈమె. అప్పట్లో ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. ఎలాంటి రొమాంటిక్ సీన్లలో నటించకపోయినా.. అగ్ర హీరోలతో పెద్ద సినిమాలు చేసింది ఈమె.
చాలా తక్కవ కాలంలోనే 100కు పైగా సినిమాల్లో నటించింది. కానీ ఏం లాభం.. 31 ఏళ్ల వయసులోనే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ అందరికీ శోకసంద్రమే. అయితే ఆమె అనతికాలంలోనే అగ్రహీరోలతో సినిమాల్లో నటించి వేలకోట్ల ఆస్తులు సంపాదించింది.
ఇక ఆమె చనిపోయిన తర్వాత ఆస్తులు ఎవరికి రావాలనే విషయంపై చాలా గొడవలు జరిగాయి. తన భార్య సౌందర్య సంపాదించిన ఆస్తులు తనకే రావాలని భర్త రఘు వాదించారు. కానీ సౌందర్య రాసిన వీలునామా ప్రకారం తమకు కూడా ఆస్తులు రావాలని అమర్నాథ్ భార్య నిర్మల, ఆమె కుమారుడు సాత్విక్ కోర్టును ఆశ్రయించారు.
కానీ అసలు సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని సౌందర్య తల్లి చెప్పింది. కేవలం నిర్మల సోదరుడు లాయర్ కావడంతోనే అలా చేశారని తెలిపింది. తర్వాత కాలంలో కుటుంబ సభ్యులు అంతా రాజీకి వచ్చి ఆమె ఆస్తులను పంచుకున్నారు.
Also Read : Kushboo : ఆ స్టార్ హీరో గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ కుష్బూ సంచలన ఆరోపణలు..!
Also Read : Vani Bhojan : ఛాన్స్ అడిగితే బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలనం..!