Health Tips : ఒకప్పుడు మన పూర్వికులు ఎలాంటి ఆహారాన్ని అయినా అప్పటికప్పుడు ఫ్రెష్ గా వండుకుని తినేవారు.. అందుకే వారు ఎలాంటి అనారోగ్యాల పాలు కాకుండా హెల్తీగా జీవించేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. మనం ఆహారాన్ని ఫ్రెష్ గా ఉన్నప్పుడు కాకుండా దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ ఆహారంలోని పోషకాలు మొత్తం పోయిన తర్వాత దానిని తింటున్నాం. ఫలితంగా ఆహారంలో ఉన్న పోషకాలు మనకు దక్కడం లేదు..
ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండడం వల్ల రోజూ ఫ్రెష్ కూరగాయలు, పండ్లు కొనలేని వారు వీటిని ఒకేసారి తెచ్చుకుని నిల్వ ఉంచుకుంటారు.. అలాగే మిగిలిపోయిన ఫుడ్ సైతం ఫ్రిడ్జ్ లోనే పెడుతూ ఉంటారు.. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫ్రెష్ గానే ఉంటాయి అని భావిస్తారు.. అయితే మీరు మిగిలి పోయిన ఫుడ్ ను ఇలా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎంత వరకు కరెక్ట్.. ఫుడ్ ను ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు పెట్టాలి.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
అందరూ ఉరుకుల పరుకుల జీవితం కారణంగా ఫ్రిడ్జ్ కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది.. ఫ్రిడ్జ్ లో పాలు, పండ్లు, కూరగాయలు, స్వీట్స్ ఇలా ఒక్కటేమిటి అన్నిటిని పెట్టేస్తున్నారు. అయితే నిపుణులు వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెడితే వాటిలోని పోషకాలు పోతాయని అంటున్నారు.
వాస్తవానికి గాలి చొరబడని కంటైనర్ లో చాలా వరకు వండిన ఆహారం కనిష్టంగా 2-3 రోజులు, ఒక్కోసారి వారం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ వంటల్లో ఉప్పు, పసుపు, పులుపు వంటివి ఉపయోగిస్తారు కాబట్టి ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం పాటు నిల్వవుంటాయట. అయితే ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాన్ని వారం లోపులోనే తినేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎక్కువ కాలం గడిస్తే అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అని చెబుతున్నారు.
Read Also : Aishwarya Lekshmi : లవర్ ను పరిచయం చేసిన యంగ్ హీరోయిన్.. పెండ్లికి ముందే ఆ పని చేస్తుందంట..!
Read Also : Chiranjeevi : తనపై జరిగిన విష ప్రయోగం గురించి రివీల్ చేసిన చిరు.. అలా చేసింది ఆయనేనట!