Hansika Motwani : ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె దేశ ముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేసింది. అయితే కెరీర్ పరంగా ఆమె స్టార్ ఇమేజ్ను సంపాదిచుకున్నా కూడా వ్యక్తిగతంగా ఆమె ఎఫైర్ల కారణంగా విమర్శలు ఎదుర్కొంది.
ఆమె ముందుగా తమిళ హీరో శింబుతో ప్రేమలో మునిగి తేలింది. ఇద్దరూ కలిసి చాలా కాలం బయట కనిపిస్తూ తిరిగారు. కానీ మధ్యలో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జయం రవితో కూడా కొన్నాళ్ల పాటు రాసుకుని, పూసుకుని తిరిగింది. కానీ త్వరగానే అతని నుంచి విడిపోయింది.
ఆ వెంబడే తమిళ నాడు సీఎం స్టాలిన్ కొడుకు అయిన ఉదయనిధి స్టాలిన్ తోకూడా కొన్నాళ్ల పాటు ఎఫైర్ నడిపింది. అతనితో కూడా త్వరగానే బ్రేకప్ చేసుకుని సిద్దార్థతో కూడా కొన్ని రోజులు ప్రేమ వ్యవహారం నడిపిందనే టాక్ ఉంది. వీరిద్దరూ అప్పట్లో బహిరంగంగానే కలిసి మెలిసి తిరిగారు.
బోర్ కొట్టిందో ఏమో గానీ ఇద్దరూ మధ్యలోనే విడిపోయారు. ఆ తర్వాత ఆమె తన స్నేహితుడు అయిన సోహైల్ కటారియాతో ప్రేమలో పడింది. ఈ సోహైల్ కటారియా ఎవరో కాదు.. ఆమె క్లోజ్ ఫ్రెండ్ భర్తనే. హన్సిక సోహైల్ తో ఎఫైర్ పెట్టుకున్నందునే ఆమె స్నేహితురాలు భర్తకు విడాకులు ఇచ్చేసింది. రీసెంట్ గానే సోహైల్ ను హన్సిక పెండ్లి చేసుకుంది.
Read Also : Tollywood : టాలీవుడ్ లో లేడీ సింగర్స్ కు కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ ఇస్తారా..?
Read Also : Sunny Leone-Saddam : సన్నీలియోన్ తో ఆ ఎక్స్ పీరియన్స్ సూపర్.. సద్దాం అంత మాట అన్నాడేంట్రా బాబు..!