Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదనుకోండి. కానీ అప్పట్లో మాత్రం హీరోయిన్లు అందరూ ఒక్కసారైనా చిరుతో నటించాలని ఆశపడేవారు. ఆయనతో నటిస్తే వెంటనే స్టార్ స్టేటస్ వస్తుందని వారంతా ఆయనతో నటించేందుకు పోటీ పడేవారు.
అలాంటి చిరంజీవి స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే అనే ఖైదీ సినిమా సినిమా వచ్చింది. ఇందులో హీరోయిన్ మాధవితో కలిసి చిరంజీవి రగులుతోంది మొగలి పొద అనే సాంగ్ లో నటించారు. ఈ పాట అప్పట్లో ఊపేసింది. ఇందులో ఇద్దరి నడుమ ఓ రేంజ్ లో రొమాన్స్ ఉంటుంది.
కాగా ఈ పాటలో నటించేందుకు మాధవి ఒప్పుకోదేమో అని ముందు అంతా అనుకున్నారంట. ఎందుకంటే చిరుకంటే ముందే మాధవి ఇండస్ట్రీకి వచ్చింది. పైగ కారులో పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి ఆమె ఒప్పుకుంటుందా అని అనుకున్నారంట. కానీ డైరెక్టర్ వెళ్లి ఈ విషయం చెప్పగానే ఆమె వెంటనే ఒప్పేసుకుందంట.
చిరంజీవి ఇప్పుడు ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదుగుతున్నారు. ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆయనంటే అమితమైన అభిమానం కూడా ఉంది. ఆయన కోసం రొమాంటిక్ సాంగ్ లో ఏంటి.. బట్టల్లేకుండా యాక్ట్ చేయమన్నా చేస్తా అంటూ చెప్పేసిందంట. దాంతో చిరంజీవి అంటే ఆమెకు ఎంత అభిమానమో అందరూ అర్థం చేసుకున్నారు.
Read Also : Taapsee Pannu : అమ్మాయిలు ప్రైవేట్ పార్టులు చూపిస్తే తప్పేంటి.. తాప్సీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు..!
Read Also : Mass Maharaja Ravi Teja : అలాంటి వ్యాధితో బాధపడుతున్న రవితేజ.. అందుకే ముఖం ఇలా అయిందా..?