ఇప్పుడు ఏ రంగంలో అయినా సరే కాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అన్నింటిలోకెల్లా సినిమా రంగంలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోయిన్లు, నటీమణులకు ఇది చాలా కామన్ గా మారిపోయింది. అయితే ఒక్కొక్కరు దీనిపై ఒక్కో విధంగా స్పందిస్తూ ఉంటారు.
ఇక తాజాగా హీరోయిన్ నందిని రాయ్ కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తెలుగులో చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. బిగ్ బాస్-2 సీజన్ లో కూడా పాల్గొంది. ఇలా పాపులర్ అయిన ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉంది. కమిట్ మెంట్లు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ఎవరి ఇష్టం వారిది. దాన్ని పెద్ద తప్పుగా భావించాల్సిన పనిలేదు. ఇక కొందరు కమిట్ మెంట్లు ఇచ్చిన తర్వాత తామేదో కాస్టింగ్ కౌచ్ కు గురైనట్టు మాట్లాడుతున్నారు.
వారే కమిట్ మెంట్లు ఇచ్చిన తర్వాత మళ్లీ వాదించడం ఎందుకు. ఇక్కడ ఇష్టం లేకుండా బలవంతంగా ఏ పని జరగదు. కాబట్టి దీన్ని పెద్ద ఇష్యూగా చూడాల్సిన పనిలేదు. కమిట్ మెంట్లు ఇవ్వకుండా ఛాన్సులు అందుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలి.