House Full : ఇప్పుడు ‘హౌజ్ ఫుల్’ బోర్డులేంటి?..

House Full : కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘హౌజ్ ఫుల్’ బోర్డులు కనిపించటం వింతే. ఈ వింత కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అక్కడ కొవిడ్-19 వైరస్ తీవ్రంగా వ్యాపించింది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు 16 లక్షలు దాటాయి. నిన్న ఆదివారం ఒక్క రోజులోనే 37,733 కేసులు నమోదు కాగా ఏకంగా 217 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మృతదేహాలకు శ్మశానాల్లో దహస సంస్కారాలను నిర్వహించటం కష్టతరం […].

By: jyothi

Published Date - Mon - 3 May 21

House Full : ఇప్పుడు ‘హౌజ్ ఫుల్’ బోర్డులేంటి?..

House Full : కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘హౌజ్ ఫుల్’ బోర్డులు కనిపించటం వింతే. ఈ వింత కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అక్కడ కొవిడ్-19 వైరస్ తీవ్రంగా వ్యాపించింది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు 16 లక్షలు దాటాయి. నిన్న ఆదివారం ఒక్క రోజులోనే 37,733 కేసులు నమోదు కాగా ఏకంగా 217 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మృతదేహాలకు శ్మశానాల్లో దహస సంస్కారాలను నిర్వహించటం కష్టతరం అవుతోంది. కాడు పేర్చటానికి ఖాళీ స్థలాలు కరువవుతున్నాయి. దీంతో చేసేదేంలేక గేట్లకు ‘హౌజ్ ఫుల్’ బోర్డులను తగిలిస్తున్నారు. కర్ణాటకలో చాలా చోట్ల ఇదే దారుణమైన పరిస్థితి నెలకొంది.

బెంగళూరులో..

కర్ణాటక రాజధాని బెంగళూరులో 13 విద్యుత్ దహన వాటికలు ఉన్నాయి. అవి ఎప్పుడూ బిజీగానే ఉంటున్నాయి. స్విచ్చాఫ్ చేసే సమయం దొరకట్లేదు. ఒక్కో శ్మశాన వాటికకి రోజుకి 20కి పైగా కరోనాతో చనిపోయినవారి డెడ్ బాడీలు వస్తున్నాయి. శ్మశానాలకు కొరత ఏర్పడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం బృహత్‌ బెంగళూరు మహానగర్‌ పాలికె(బీబీఎంపీ)కి ప్రత్యేకంగా 230 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వాటిలో అంత్యక్రియల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపు చామ్ రాజ్ పేట లోని శ్మశాన వాటిక హౌజ్ ఫుల్ బోర్డును ప్రదర్శించింది.

House Full : there is no empty space at burial grounds in bengalore

House Full : there is no empty space at burial grounds in bengalore

సొంత స్థలాల్లో చేసుకోండి: House Full

శ్మశాన వాటికల్లో ఖాళీ జాగాలు లేకపోవటం వల్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. మృతుల కుటుంబీకులే తమ సొంత స్థలాల్లో అంతిమ సంస్కారాలను నిర్వహించుకోవాలని కోరింది. ప్లాట్లు, ఫామ్ హౌజ్ లు, పంట పొలాలు, దొడ్లు తదితర ఖాళీ ప్రదేశాలు కలిగినవారు సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇన్ని మృతదేహాలు వస్తుంటే ఇక అనధికారికంగా ఎంత మంది చనిపోతున్నారో తలచుకుంటేనే భయంగా ఉందని స్థానికులు అంటున్నారు. బతికుండగా ఎంత డబ్బు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా చనిపోయాక మట్టిలో కలిసిపోవటానికి కనీసం ఆరడుగుల స్థలం కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని మనిషి కలలో కూడా ఊహించి ఉండడు అంటున్నారు.

Related News