job : ఏపీలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు.. రేపటితోనే దరఖాస్తు గడువు పూర్తి..

Job: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పలు రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ జాబులకు రేపటితో అప్లికేషన్ గడువు ముగుస్తోంది. పూర్తి ఆన్ లైన్ లో అప్లై చేసే ఈ జాబుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఈ ఒక్కటనే కాదు గత కొన్ని రోజుల నుంచి ఏపీలో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో దాదాపు 38 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు […].

By: jyothi

Updated On - Tue - 7 December 21

job : ఏపీలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు.. రేపటితోనే దరఖాస్తు గడువు పూర్తి..

Job: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పలు రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ జాబులకు రేపటితో అప్లికేషన్ గడువు ముగుస్తోంది. పూర్తి ఆన్ లైన్ లో అప్లై చేసే ఈ జాబుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఈ ఒక్కటనే కాదు గత కొన్ని రోజుల నుంచి ఏపీలో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో దాదాపు 38 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు నవంబర్ 12 న ప్రారంభమయ్యాయి. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, హాస్టల్ వెల్ ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 వంటి వివిధ రకాల పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఏ పోస్టుకు ఎటువంటి విద్యార్హత ఉంది. మరియు ఏ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయనే విషయాలను గూర్చి తెలుసుకుంటే…


jobs

jobs



మొత్తం ఉన్న 38 ఖాళీలలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 6 ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో లేదా పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ అయినా కానీ డిప్లొమా పట్టా అయినా కానీ పొంది ఉండాలి. ఈ పోస్టుకు 18 నుంచి 42 సంవత్సరాల వ్యక్తులను అర్హులుగా నిర్ణయించారు. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తులకు వేతనంగా 25,140 రూపాయల నుంచి 73,720 రూపాయల వరకూ అందనుంది. ఇక అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల విషయానికి వస్తే ఇవి ఇందులో 29 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు స్టాటిస్టిక్స్ లో డిగ్రీ పాస్ కావాలి. మ్యాథ్స్, ఎకనామిక్స్ మరియు కామర్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు స్టాటిస్టిక్స్ సబ్జెక్టులో పాస్ అయి ఉంటేనే వారికి ఈ పోస్టులు అప్లై చేసుకునేందుకు అర్హత ఉంటుంది. అభర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉండవచ్చు. వీరికి 24,440 రూపాయల బేసిక్ వేతనంతో కలుపుకుని 71,510 రూపాయల పూర్తి వేతనం అందనుంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టు విషయానికి వస్తే ఇది కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఉంది. ఇక హాస్టల్ వెల్ ఫేర్ గ్రేడ్ 2 పోస్టులు 2 ఉన్నాయి. ఈ పోస్టులకు కూడా 42 సంవత్సరాల గరిష్ట వయసును నిర్ధారించారు.

Tags

Latest News

Related News