Jabardasth Hari : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు ఇప్పుడు మరోసారి సంచలనం రేపుతోంది. అయితే ఈ సారి ఇందులో జబర్దస్త్ కమెడియన్ ఇరుక్కున్నాడు. జబర్దస్త్ కమెడియన్ హరి గతంలో కూడా ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో అలరించాడు.
అయితే తాజాగా మరోసారి ఆయన ఎర్రచందనం కేసులో ఇరుక్కున్నాడు. ఈ సారి పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ఆయన ముఠాకు చెందిన కిషోర్ అనే డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు వాహనాలు తప్పించుకునేందుకు ప్రయత్నించాయి.
అతికష్టం మీద వాటిని పట్టుకోగా ఒక ట్రక్ డ్రైవర్ దొరికాడు. మరో ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. ఈ రెండింటిలో కలిపి రూ.60 లక్షల ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. నటుడు హరి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. త్వరలోనే వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తాం అంటూ తెలిపాడు డీఎస్పీ.
హరి ఎన్నో ఇబ్బందులు పడి జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చాడు. మంచి స్కిట్లు కూడా చేశాడు. కానీ ఇప్పుడు ఆయన కేసుల్లో ఇరుక్కుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. గతంలో కూడా హరిపై ఎర్రచందనం కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి అతని పేరు తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది.
Read Also : Actress Avika Gor : నాకు ఏడుసార్లు పెళ్లి చేశారు.. లైఫ్ నాశనం చేశారు.. అవికా గోర్ ఎమోషనల్ ..!
Read Also : Nidhhi Agerwal : వాటి సైజు తగ్గించుకోమని నీచంగా మాట్లాడాడు.. నిధి అగర్వాల్ సంచలనం..!