Jabardasth Rithu Chowdary Reacts On Casting Couch : బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ వల్ల చాలామంది ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. ఆమె మొన్నటి వరకు హైపర్ ఆది టీమ్ లో నటించింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేసింది ఈ భామ. అలాగే ఇంటిగుట్టు అనే సీరియల్ లో ఇప్పటికీ నటిస్తోంది. కాగా ఆమె వాస్తవానికి సినిమాల్లో నటించాలనే కోరికతోనే హైదరాబాద్ కు వచ్చింది.
రీతూ చౌదరి ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమాల్లో ఛాన్సులు రాక బుల్లితెరపై సెటిల్ అయిపోయింది. అందాలు ఆరబోయడంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు ఈ భామ. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ఈమె.. సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఏంటో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ భామ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఇప్పటికీ ఉంది. కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు తట్టుకోలేక బయటకు వచ్చేశాను అంటూ తెలిపింది. అంటే మీరేమైనా కాస్టింగ్ కౌచ్ లాంటిది ఎదుర్కున్నారా అని యాంకర్ అడగ్గా.. అవును నేను కూడా ఫేస్ చేశాను.
ఓ నిర్మాత మేనేజర్ తో నాకు కాల్ చేయించాడు. మీరు ప్రొడ్యూసర్ సర్ తో కమిట్ అయితే మీకు రూ.లక్ష రూపాయలు ఇచ్చేస్తాం.. మంచి సినిమాలో ఛాన్స్ కూడా ఇప్పిస్తాం అంటూ దారుణంగా మాట్లాడాడు. చెడా మడా తిట్టేసి ఫోన్ కట్ చేశాను.
అప్పటి నుంచి ఆ నెంబర్ బ్లాక్ చేసేశా. ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటుందేమో అనే భయంతో టీవీ ప్రోగ్రామ్స్ లోకి వచ్చేశాను. అప్పటి నుంచి నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు అంటూ తెలిపింది రీతూ చౌదరి.
Also Read : Renu Desai Unknown Story : ఆ కోరిక తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి లేచిపోయిన రేణూ దేశాయ్..!