Viral News : ఇది వినడానికే మరో వింత. ఇప్పటి వరకు గర్భం దాల్చడం అంటే ఆడవాళ్లకు సంబంధించిన మ్యాటర్ అని మాత్రమే మనకు తెలుసు. పురిటినొప్పులు పడటం, బిడ్డల్ని కనడం అనేది ఆడవారికి సంబంధించిన విషయం మాత్రమే. అయితే ఇప్పుడు దేశంలోనే మొదటిసారి ట్రాన్స్ జెండర్ పురుషుడు గర్భం దాల్చాడు. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కేరళలోని కోజికోడ్ కు చెందిన జహద్, జియా పావల్ అనే లింగమార్పిడి జంట నివసిస్తోంది. వీరిద్దరూ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారాడు. వీరిద్దరూ ఇంటికి దూరంగా బతుకుతున్నారు. అయితే లింగమార్పిడి తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
అప్పటి నుంచే వీరిద్దరూ మూడేండ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే జహాద్ గర్భం దాల్చాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని జియా తన ఇన్ స్టాలో పేర్కొంది. నేను పుట్టుకతో అమ్మాయిని కాకపోయినా.. అమ్మా అని పిలిపించుకోవాలనే భావన మాత్రం ఈరోజు నెరవేరబోతోంది.
జహాద్ కు త్వరలోనే బిడ్డ పుట్టబోతోంది అంటూ తెలిపింది జియా. అయితే ఈ విషయం తెలుసుకున్న కొందరు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. మీ ప్రేమకు అవధుల్లేవు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇదేం విడ్డూరం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also : Writer Padmabhushan Movie Review : రైటర్ పద్మభూషణ్ మూవీ రివ్యూ
Read Also : Michael Movie Review : సందీప్ కిషన్ ‘మైఖేల్’ మూవీ రివ్యూ..!