Jayachitra : సీనియర్ హీరోయిన్ జయసుధ గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత ఎక్కువ కాలం ఛాన్సులు రాకపోవడంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది. తల్లి, అత్త, నానమ్మ పాత్రల్లో బాగా మెరుస్తోంది. ఇదిలా ఉండగా ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఆమె మాట్లాడుతూ.. నేను, కృష్ణం రాజు కలిసి దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో కటకటాల రుద్రయ్య అనే సినిమా చేశాం. ఇందులో నాతో పాటు జయచిత్ర కూడా మరో హీరోయిన్ గా చేసింది. అయితే మా ఇద్దరికీ షూటింగ్ సమయంలో చెప్పుల విషయంలో గొడవ వచ్చింది. నేను హై హీల్స్ వేసుకోవడం ఆమెకు నచ్చలేదు.
చెప్పులు విప్పేసి రా అంటూ నాకు చెప్పింది. కానీ ఆమె కోసం నేను చెప్పులు విప్పడం ఏంటని అనిపించింది. అలాగే హై హీల్స్ వేసుకుని వెళ్లాను. ఇక సినిమాలో ఓ సీన్ లో ఆమె నన్ను చెంపపై కొట్టాలి. కానీ ఆమె నా మీద ఉన్న కోపంతో నిజంగానే గట్టిగా కొట్టింది. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది.
వెంటనే చెప్పుతో బలంగా కొట్టాను. అలా మేమిద్దరం కొట్టు కున్నాను. కానీ అలా మేం కొట్టుకోవడం కూడా బాగా పండటంతో దాన్ని సీన్ కింద పెట్టేశారు దాసరి నారాయణ రావు. కానీ అసలు విషయం ఏంటంటే మేం నిజంగానే కొట్టుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది జయసుధ. ఇప్పుడు మాత్రం మేం బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం అంటూ తెలిపింది జయసుధ.
Also Read : Saikumar : సాయికుమార్ ను చంపేస్తా అంటూ బెదిరించిన స్టార్ హీరో.. ఎందుకంటే..?
Also Read : Sonam Kapoor : నా ఫ్రెండ్స్ అందరితో నా బ్రదర్స్ సె* చేశారు.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు..!