JD Chakravarthy : ఆర్జీవీ కొన్ని రోజుల క్రితం ఓ విషయంలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కున్నాడు. బిగ్ బాస్ బ్యూట అషురెడ్డితో చేసిన బూతు ఇంటర్వ్యూలో ఏకంగా ఆమె కాళ్లు నాకడం తీవ్ర దుమారం రేపింది. ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ అయి ఉండి ఇలా కాళ్లు నాకడం ఏంటంటూ తిట్టిపోశారు. తాజాగా ఆర్జీవీ శిష్యుడు కూడా అంతకు మించి అన్నట్టుగానే ప్రవర్తించాడు.
ఇంతకీ ఆయన ఎవరో కాదండోయ్ జేడీ చక్రవర్తి. ఆయన తాజాగా ఈషారెబ్బతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఆయన తాజాగా ఓం కార్ నిర్వహిస్తున్న సిక్త్స్ సెన్స్ టాక్ షోకు వచ్చాడు. ఇందులో ఆయన చాలా ఫన్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే అక్కడున్న ముద్దుగుమ్మలను చూశారు చక్రవర్తి.
మీరేంటి ఇంత తెల్లగా ఉన్నారు. మీ కాళ్లు అంత తెల్లగా ఉన్నాయేంటి. అవి అసలు ఒరిజినలేనా.. వాటిని ముద్దు పెట్టుకోవచ్చా అంటూ దారుణంగా కామెంట్లు చేశాడు. దాంతో షోలో ఉన్న వారంతా షాక్ అయిపోయారు. మనోడు మంచి రసికుడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇంకా కొందరు అయితే గురువును మించిన శిష్యుడు అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇస్తున్నారు. ఇక మీరెవరికైనా ట్రై చేశారా అని ఓంకార్ అడగ్గా.. మా నాన్న మీద ఒట్టు చాలామంది హీరోయిన్లకు ట్రై చేశా.. కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు చక్రవర్తి.
Read Also : Karate Kalyani : ఐదు నిముషాల సుఖం కోసం కక్కుర్తి పడొద్దు.. నటి కరాటే కల్యాణి సంచలన కామెంట్లు..!
Read Also : Vishnu Priya : అతనితో లిప్ లాక్ చేయాలని ఉంది.. విష్ణుప్రియ ఏంటీ మాటలు..!